అమరావతిలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు ప్రయత్నాలు నిజంగా ఏపీ ప్రజలకు శుభవార్తే
గూగుల్ వంటి దిగ్గజ సంస్థ అమరావతిలో కాలు మోపడం అంటే మాములు విషయం కాదు. అమరావతిలో గూగుల్ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తే ఏపీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలయినట్టే . ఇందుకు కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఫలితంగా అమరావతి ప్రధాన రహదారి ని అనుకుని ఉన్న అనంతవరం – నెక్కల్లు ప్రక్కన షుమారు 143 ఎకరాల భూమిని గూగుల్ కి కేటాయించేందుకు CRDA ముందుకొచ్చింది. ఈ ప్రాంతం అటు విమానాశ్రయం , ఇటు రైల్వే జంక్షన్ కు దగ్గరగా ఉండటమే కాకుండా గుంటూరు – విజయవాడ హైవే మరియు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు కనెక్టివిటీ ఉండటంతో గూగుల్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే గూగుల్ ప్రతినిధులు CRDA అధికారులతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు
అన్నీ అనుకూలిస్తే ఈ స్థలంలో మొదటి విడత గా డేటా సెంటర్ , ఐటీ సర్వీసులు , ఆఫీస్ క్యాంపస్ వంటివి నిర్మించే యోచనలో గూగుల్ ఉన్నట్టు తెలుస్తుంది
అధికారుల ప్రయత్నాలు ఫలించి అమరావతిలో గూగుల్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తే దాదాపు 8 వేలమందికి ప్రత్యక్షంగానూ మరో 20 వేలమందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. అంతేకాదు గూగుల్ రాకతో అమరావతి ప్రపంచ స్థాయి టెక్నాలజీ నగరంగా పరుగులు పెడుతుంది అనడంలో సందేహం లేదు
గూగుల్ రాకతో రాష్ట్రానికి మరిన్ని ఐటీ కంపెనీలు తరలి వస్తాయని తద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలు పెరిగి అమరావతి బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందని భావించి ఏపీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది
పరేష్ తుర్లపాటి ✍️