సారు H 1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచారు – ఇంతకీ అసలు ట్రంప్ ఆర్డర్ లో ఏముంది ?
H1 B వీసా ఫీజు భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసారు
కొత్త ఆదేశాల ప్రకారం ఎంప్లాయర్ ఇకపై ప్రతి H 1 B దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలి
ఈ వార్త టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది
ముఖ్యంగా భారతీయ టెకీలలో భయాందోళనలను రేకెత్తించింది
H 1B వీసా ఫీజు భారీగా పెంచడం వెనుక అసలు కారణం వివరిస్తూ ‘ నైపుణ్యం కలిగిన వలస కార్మికుల సేవలను తాత్కాలికంగా అమెరికాలో ఉపయోగించుకునే ఉద్దేశ్యంతో H 1B వీసాలు జరీ చేయడం జరుగుతుందని , కానీ స్థానిక ఉద్యోగాలలో తక్కువ జీతం , తక్కువ నైపుణ్యం కలిగిన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో H 1B అవరోధంగా మారిందని’ ట్రంప్ అన్నారు
ఈ విధానం వల్ల ముఖ్యంగా టెక్ ఇండస్ట్రీలో అమెరికన్లు గణనీయంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు
ఐటి సంస్థలు H 1B ని దుర్వినియోగం చేసి నైపుణ్యం పేరుతొ వలస దారులను ప్రోత్సహించి సాఫ్ట్ వేర్ రంగంలో అమెరికన్లను పక్కనబెడుతున్నాయని ఆయన ఆరోపించారు
అందుకే సెప్టెంబర్ 21 2025 ఉదయం నుంచి ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్పారు
ఈ ప్రకటన అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే , లేదా ప్రవేశించటానికి ప్రయత్నించే విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు
ఈ ఆర్డర్ కాలపరిమితిని ఏడాది గా నిర్ణయించి తదుపరి వీసా లాటరీ తీసే 30 రోజుల్లోపు ఈ ఆర్డర్ వల్ల అమెరికన్లకు యెంత మాత్రం ఉపయోగకరంగా ఉంటుందనేది సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ట్రంప్ ఆ ఆర్డర్ లో పేర్కొన్నారు
వలస ఉద్యోగుల వల్ల అమెరికన్ల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగదని అమెరికన్ హోమ్ ల్యాండ్ సెక్రటరీ భావిస్తే వీసా ఫీజు లక్ష డాలర్లను మాఫీ చేయవచ్చని ఆయన చెప్పారు
ఇకపై అమెరికాలో వలస ఉద్యోగులను స్పాన్సర్ చేసే కంపెనీలు విధిగా సెక్రటరీకి ఫీజులు చెలించి రసీదులు పొందాలని చెప్పారు . ఒకవేళ స్పాన్సర్ చేసే కంపెనీలు ఫీజులు చెల్లించడంలో విఫలం అయితే ఉద్యోగుల ప్రవేశాలను తిరస్కరించడం జరుగుతుందని చెప్పారు
ప్రస్తుతం ఉన్న వేతన పరిమితి కన్నా వీసా ఫీజు ఎక్కువగా ఉండటంతో వేతన పరిమితిని పునః సమీక్షించాలని ట్రంప్ లేబర్ కార్యదర్శిని ఆదేశించారు
ఈ ఆర్డర్ అమెరికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందా ? లేదా ? అనేది సమీక్షించి సంయుక్త నివేదికను ఇవ్వాలని ట్రంప్ హోమ్ ల్యాండ్ సెక్రటరీని , లేబర్ కార్యదర్శిని ఆదేశించారు
