“మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపిస్తుంది ?” భారత ప్రధాని ఇందిరాగాంధి ప్రశ్న

Spread the love

మిస్టర్ రాకేశ్ శర్మ ! అంతరిక్షం నుంచి చూస్తే భారత దేశం ఎలా కనిపిస్తుంది?” భారత ప్రధాని ఇందిరా గాంధి ప్రశ్న

సారే జహా సే అచ్ఛా” రాకేశ్ శర్మ జవాబు

అప్పట్లో ఈ జవాబు కోట్లాదిమంది భారతీయుల హృదయాలను తాకింది.. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగింది.. అందుకు కారణం ఉంది.. అంతరిక్షంలోకి అడుగు పెట్టిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ

1984 ఏప్రిల్ 3 న ఇండియా.. రష్యా భాగస్వామ్య వ్యోమ నౌక సూయజ్ టి 11 అంతరిక్ష యానానికి ఏర్పాట్లు జరిగాయి..ఈ అంతరిక్ష యానం కోసం ఇండియా నుంచి 52 మంది సోవియట్ రష్యా వెళ్లగా వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కెప్టెన్ రాకేశ్ శర్మ ఒక్కరే సెలెక్ట్ అయ్యారు

సెల్యూట్ సెవెన్ స్పేస్ లో భూమి చుట్టూ తిరుగుతూ అంతరిక్షంలో షుమారు 8 రోజులు గడిపారు రాకేశ్ శర్మ.. రాకేశ్ శర్మ అంతరిక్ష యానంతో దేశం యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది .. ఆ సందర్భంగా రాకేశ్ శర్మ తో ఇందిరా గాంధీ మాట్లాడినప్పుడు పై సంభాషణ నడిచింది

తర్వాత రాకేశ్ శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ చేసి కొంతకాలం HAL లో కూడా పనిచేశారు

ఆ తర్వాత రాకేశ్ శర్మ ఏమయ్యారో చాలామంది మర్చిపోయారు

2024 కి రాకేశ్ శర్మ అంతరిక్ష యానానికి నలభై ఏళ్ళ పూర్తయ్యాయి.. ఈ  సందర్భంగా రాకేశ్ శర్మ మళ్ళీ తెర మీదకు వచ్చారు.. ప్రస్తుతం ఆయన ఉన్నారు ?.. ఏం చేస్తున్నారు? అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి

ప్రస్తుతం రాకేశ్ శర్మ కు 76 ఏళ్లు.. తమిళ నాడు లోని కూనూరు లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు .. గోల్ఫ్ ఆడటం.. తోట పని ఆయన హ్యాబీలు

అంతరిక్ష యానం చేసి తిరిగి వచ్చిన తొలినాళ్లలో తన  అనుభవాల గురించి రాకేశ్ శర్మ  చెప్తూ చుట్టుపక్కల ఉండే తల్లులు వాళ్ళ పిల్లలకు తనను చూపిస్తూ ఆయన చందమామ దగ్గరికి వెళ్లి వచ్చాడు అని పరిచయం చేసేవాళ్ళు అని చెప్పారు

అంతేకాదు కొంతమంది చిత్రంగా దేవుడు కనిపించాడా? అని కూడా అడిగేవాళ్ళు.. ఈ జనరేషన్ పిల్లలకు చాలామందికి తెలీదు అనుకుంటా.. కొంతమంది నన్ను గుర్తు పట్టరు కూడా అని అన్నారు

ఏది ఏమైనా తొలి భారతీయ అంతరిక్ష వ్యోమగామిగా రాకేశ్ శర్మ ది ఒక చరిత్ర.. ఎన్నేళ్ళయినా ఆ చరిత్ర అలా ఉండిపోతుంది

ఫోటో చూశారుగా .. 21 ఏళ్ల వయసులో అంతరిక్షానికి వెళ్ళిన రాకేశ్ శర్మ.. 76 ఏళ్ల వయసులో ప్రస్తుతం తమిళనాడులోని కూనూరు లో విశ్రాంతి తీసుకుంటున్న రాకేశ్ శర్మ

సారే జహా సే అచ్ఛా

పరేష్ తుర్లపాటి ✍️


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!