ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సైన్యం నుంచి కఠోర శిక్షణ పొందిన కొంతమంది మెరికల్లాంటి భైరవ్ కమెండోలు చేసిన విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మొన్న రాజస్థాన్ ఆర్మీ క్యాంప్ లో పరిశీలించిన సంగతి తెలిసిందే
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సాయుధ దళాలను మరింత పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా కొంతమంది మెరికల్లాంటి సైనికులను ఎంపిక చేసి ప్రపంచ స్థాయి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వారికి భైరవ్ కమెండోలుగా నామకరణం చేసారు
ఇప్పుడు తాజాగా సైనిక అధికారులు అటువంటిదే మరో విన్యాసాలకు శ్రీకారం చుడుతున్నారు
రక్షణ శాఖ అధికారులు మీడియాకి చెప్పిన వివరాల ప్రకారం , సైన్యంలో త్రివిధ దళాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి ఆపరేషన్ త్రిశూల్ పేరిట కొత్త వ్యాయామానికి సిద్ధం చేస్తున్నారు
ఈ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం రేపటి నుంచి అనగా అక్టోబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభం అయి నవంబర్ 10 న ముగుస్తుంది
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా శత్రువులను ఎదుర్కోవడం ఆపరేషన్ త్రిశూల్ ప్రధాన లక్ష్యం
అందుకే త్రిశూల్ వ్యాయామం లో ఆర్మీ ఒక్కటే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఇండియన్ నావీలను కూడా కలిపి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ గా తయారు చేసి శిక్షణ ఇస్తున్నారు
ఈ శిక్షణలో ఎడారి ప్రాంతాలు , పర్వత ప్రాంతాలు , సముద్రాల నుంచి వచ్చే టార్గెట్లను చేధించే విధంగా రూపకల్పన చేస్తున్నారు
త్రివిధ దళాలు సమన్వయము చేసుకుని శత్రువులతో పోరాడే విధంగా ప్రత్యేక వింగ్ తయారు చేస్తున్నారు
రఫెల్ యుద్ధ విమానాలను మోహరించడం , టార్గెట్ ఛేదించడం వంటి పోరాటాలకు ఎయిర్ ఫోర్స్ నుంచి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయగా , సముద్ర ఉపరితలంలో , భూ ఉపరితలంలోనూ టార్గెట్లను ఛేదించడం కోసం నావీ , ఆర్మీ లతో ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు
ప్రధాన యుద్ధ ట్యాంకులు , క్షిపణులు , యుద్ధ హెలికాఫ్టర్లు , విమానాలు వాడటంలో షుమారు 25 వేల మంది సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి దళాలుగా ఏర్పాటు చేస్తున్నారు !
