Home » ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం తీసుకుని ఇందిర తన జీవితాన్నే కోల్పోయారు ! – చిదంబరం

ఒకే ఒక్క పొరపాటు నిర్ణయం తీసుకుని ఇందిర తన జీవితాన్నే కోల్పోయారు ! – చిదంబరం

Spread the love

1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ పేరిట స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య తీసుకోవాలనే నిర్ణయం తీసుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పొరపాటు చేసారని మాజీ హోమ్ మంత్రి , కాంగ్రెస్ ఎంపీ చిదంబరం సంచలన వాఖ్యలు చేసారు . అంతేకాదు స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య “తప్పు నిర్ణయం” అని అభివర్ణించారు.

ఆ “తప్పు నిర్ణయంతో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన జీవితాన్ని ఫణంగా పెట్టాల్సివచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఖుష్వంత్ సింగ్ సాహిత్య ఉత్సవం 2025లో మాజీ కేంద్ర హోం మరియు ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ తో పోలిస్తే ఆపరేషన్ బ్లాక్ థండర్ సంక్షోభాన్ని చక్కగా పరిష్కరించిందని , సిక్కు పవిత్ర స్థలం లోపల సైన్యం ప్రమేయం లేకుండానే అది విజయవంతమైందని అన్నారు.

అలా అని ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది కేవలం ఇందిరాగాంధీ సొంత నిర్ణయం కాదని, సైన్యం, పోలీసులు, నిఘా మరియు పౌర సేవల యొక్క సమిష్టి నిర్ణయం అని ఆయన అన్నారు.

“ఇక్కడ ఏ సైనిక అధికారులను అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు . కానీ స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యం ప్రమేయంతో కూడిన ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా పొరపాటు నిర్ణయమే . కొన్ని సంవత్సరాల తరువాత, సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా స్వర్ణ దేవాలయాన్ని తిరిగి పొందడానికి మేము సరైన మార్గాన్ని చూపించాము” అని ఆయన అన్నారు.

శ్రీమతి గాంధీ ఆ తప్పుకు తన జీవితాన్ని త్యాగం చేయాల్సివచ్చింది .. అయితే ఇది సైన్యం, పోలీసులు, నిఘా మరియు పౌర సేవల సమిష్టి నిర్ణయం కాబట్టి దీనికి శ్రీమతి గాంధీ ఒక్కరినే బాధ్యులను చేసి నిందించలేము ” అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు.

రచయిత హరీందర్ బవేజాతో ‘వారు మిమ్మల్ని కాల్చివేస్తారు, మేడమ్: నా జీవితం సంఘర్షణ ద్వారా’ అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా హిదంబరం ఒక సభలో ప్రసంగించారు.

ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జూన్ 1 నుండి జూన్ 10, 1984 వరకు భారత సైన్యం నిర్వహించిన 10 రోజుల సైనిక దాడి.

జూన్ 6న, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు సైన్యం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించింది. ఆలయ సముదాయం లోపల ఆయుధాలను నిల్వ చేసిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని సిక్కు ఉగ్రవాదులను తొలగించడం ఈ ఆపరేషన్ లక్ష్యం.

రాడికల్ సిక్కు సమూహం దమ్‌దామి తక్సల్ నాయకుడు భింద్రన్‌వాలే, అతని అనేక మంది సాయుధ అనుచరులను ఈ ఆపరేషన్ సమయంలో సైన్యం తుదముట్టించింది . పవిత్ర స్థలం నుండి ఉగ్రవాదులను తరిమికొట్టడానికి ఉద్దేశించిన ఈ మిషన్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద సైనిక చర్యలలో ఒకటిగా మిగిలిపోయింది.

ఆపరేషన్ బ్లూ స్టార్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది .

అక్టోబర్‌ 31 , 1984 వ సంవత్సరంలో న్యూఢిల్లీ నివాసంలో ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు సిక్కు అంగరక్షకులు హత్య చేశారు.

ఆ రకంగా ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యను ఆదేశించి పొరపాటు నిర్ణయం తీసుకోవడంతో తన జీవితాన్నే కోల్పోవాల్సి వచ్చిందని చిదంబరం అన్నారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *