ప్రయాణీకులకు విజ్ఞప్తి .. ఆఖరి నిమిషంలో రైల్వే స్టేషన్ కు వచ్చారా ? టికెట్ తీసుకోలేకపోయారా ? డోంట్ వర్రీ .. ఈ పని చేయండి ..!

Spread the love

రైలు ప్రయాణాలు అంటే చాలామందికి ఉరుకులు పరుగుల మీద ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే

రైల్వే స్టేషన్ కి బాగా ముందుగా చేరుకొని క్యూలో నిలబడి కౌంటర్లలో టికెట్లు తీసుకుని నిదానంగా ప్లాట్ ఫార్మ్ మీదకు వెళ్లేవారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ ఆఖరి నిమిషంలో హడావుడిగా రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు చాలా ఇబ్బందులు ఉంటాయి

దగ్గరి స్టేషన్లకు టికెట్లు తీసుకోవాలంటే అప్పటికే కౌంటర్ల వద్ద ఉన్న రద్దీ వల్ల ఒక్కోసారి టికెట్లు దొరక్కపోవచ్చు
దొరికినా రైలు ప్లాట్ ఫార్మ్ నుంచి బయలుదేరి వెళ్లిపోవచ్చు

ఇంకోపక్క ప్రయాణీకులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన బంధువులది ఇంకో తిప్పలు

ప్లాట్ ఫార్మ్ టికెట్ కౌంటర్లో విపరీతమైన రష్ లో టికెట్ తీసుకునేసరికి సగం రైళ్లు కూడా వెళ్లిపోతాయి

రైల్వే స్టేషన్ల లో ట్రెయిన్ టికెట్ కరెంట్ బుకింగులు ఉంటాయని అందరికీ తెలుసు
ఆ బుకింగ్ కౌంటర్లలో చాంతాడంత క్యూలు ఉంటాయని కూడా అందరికీ తెలుసు
ఆ లైన్లు గూడ్స్ రైలు మాదిరి అడుగులో అడుగు వేసుకుంటూ కదుల్తాయని కూడా అందరికీ తెలుసు కదా

అందుకే ప్రయాణీకుల ఇబ్బందులు గమనించి రైల్వే వారు కొన్ని సదుపాయాలు కల్పించారు

ఇప్పుడు ఆ ప్రయాసలు ఏమీ లేకుండా సింపుల్ గా మీ టికెట్ మీరే తీసుకునే కియోస్క్ లు వచ్చాయ్

రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల స్థానంలో కియోస్కులు ఏర్పాటు చేసారు

ఈ కియోస్కుల దగ్గర రైల్వే అసిస్టెంట్ ఒకరు ఉండి టికెట్లు తీసుకోవడంలో ప్రయాణీకులకు సహాయం చేస్తారు
లేదూ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది అనుకుంటే సింపుల్ గా మన టికెట్ మనమే తీసుకోవచ్చు

కంప్యూటర్ డబ్బా ముందు కూర్చుని మీరు ఎక్కాల్సిన రైలు డీటైల్స్ టైపు చేసి క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ పేమెంట్ చేస్తే టికెట్ మీ చేతిలో వాలుతుంది

బోలెడు టైము సేవు
చిల్లర ప్రాబ్లమ్స్ నిల్లు

కౌంటర్లలో చిల్లర ప్రాబ్లమ్ అంటూ లేట్ అవకుండా కియోస్కులలో ఫాస్ట్ గా అవడంతో పెద్దగా క్యూలు కూడా ఉండవు

ఇదేదో బావుంది కదా

గత కొద్ది నెలల కిందటే రైల్వే వారు అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ కియోస్కులు ఏర్పాటు చేసారు .. అయినా చాలామందికి ఈ సదుపాయం తెలియక ఆందోళన పడుతున్నారు

ఈ ప్రయోగం విజయవంతం అవడంతో మరిన్ని కియోస్కులు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు

సరే ఇదంతా ఓకే ,

కానీ ఆఖరి క్షణంలో వచ్చి రద్దీ వల్ల కియోస్కులలో కూడా టికెట్ తీసుకోలేకపోయారా ?

డోంట్ వర్రీ

టికెట్లు కొనకపోయినా పర్లేదు .. ముందు రైలు ఎక్కేయండి

వెంటనే మొబైల్ ద్వారా UTS యాప్ లో టికెట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోండి .. టిటీ అడిగినప్పుడు చూపించండి .. అంతే సింపుల్

గుర్తుపెట్టుకోండి .. ఒకవేళ మీరు టికెట్ కొనకుండా రైలేక్కితే ఆలస్యం చేయకుండా వెంటనే యాప్ ద్వారా మీరు వెళ్లాల్సిన స్టేషన్ కు టికెట్ తీసుకోండి

ఈ UTS అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. కియోస్కులతో కూడా పనుండదు. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. అయితే రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి 500 మీటర్ల దూరంలోపలే ఈ యాప్ పని చేస్తుంది. ఎందుకంటే.. టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కిన వాళ్లు.. జర్నీలో టీటీని చూసి టికెట్ కొనకుండా..

అదీ సంగతి

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!