స్టేడియంలో పానీపూరీ అమ్మే స్థాయి నుంచి 2. 4 కోట్ల ఐపీఎల్ ప్లేయర్ స్థాయికి ఎదిగిన యశస్వి సక్సెస్ స్టోరీ !
ముంబై స్టేడియంలో జోరుగా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ లు జరుగుతుంటే ఓ కుర్రాడు మాత్రం బయట గేటు దగ్గర పానీపూరీ అమ్ముతూనే తదేకంగా ప్లేయర్ల ఆట చూస్తుండేవాడు
ఆ కుర్రాడి పేరు యశస్వి జైస్వాల్
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ళ యశస్వి పొట్టకూటి కోసం ముంబై వచ్చి పానీపూరీ అమ్ముతుండేవాడు
అతడికి క్రికెట్ అంటే ప్రాణం
అందుకే ముంబై స్టేడియం బయట పానీపూరీ అమ్ముతూనే ఆటగాళ్ల ఆట తీరును గమనించేవాడు
ఆ గమనింపుతోనే వీధుల్లో ఇతర పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేవాడు
ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ కావాలనేది అతడి లక్ష్యం
అతడి లక్ష్యాన్ని జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ గమనించి చేరదీసి ఆటలో మెళుకువలను నేర్పి శిక్షణ ఇచ్చాడు
జ్వాలాసింగ్ కోచింగ్ లో ఆ కుర్రాడు సుశిక్షుతుడైన ఆటగాడిగా ఎదిగాడు
దాంతో దేశవాళీ క్రికెట్లో పరిమిత 50 ఓవర్ల మ్యాచ్ లో డబుల్ సెంచురీ చేసి అతి పిన్న వయసులో ఆ రికార్డ్ సాధించిన కుర్రాడిగా క్రికెట్ పెద్దల కళ్ళలో పడ్డాడు
దాంతో 2020 ఐపీఎల్ మ్యాచుల్లో అతడ్ని రాజస్థాన్ రాయల్స్ 2. 4 కోట్లకు కొనుగోలు చేసింది
దాంతో అతడి దశ తిరిగింది
పానీపూరీ అమ్మే దశ నుంచి 2 కోట్ల నలభై లక్షలకు ఐపీఎల్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున బిడ్ అయ్యే స్థాయికి యశస్వి ఎదగటం వెనుక క్రికెట్ పై అతడికున్న ప్యాషనే కారణమని అతడి కోచ్ అంటున్నారు