అంతరిక్షం లోకి అడుగుపెట్టబోతున్న తెలుగమ్మాయి జాహ్నవి దంగేటి సక్సెస్ స్టోరీ
పశ్యిమ గోదావరి జిలా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బీటెక్ చదువుకుంది
అయితే ఈమెకు చిన్నతనం నుంచి అంతరిక్ష యానం అంటే ఆసక్తి
చిన్నప్పటినుంచి చందమామ కధలు , సౌర కుటుంబం గురించి వింటూ పెరిగింది .. ఆ ప్రభావంతో చిన్ననాటి నుంచే స్పేస్ గురించి ఆమెకు ఆసక్తి పెరిగింది
చదువు పూర్తి కాగానే పోలాండ్ లోని అనలాగ్ వ్యోమ గాముల శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుని 19 ఏళ్ళ అతి పిన్న వయసులోనే అనలాగ్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామర్ అయ్యింది
తాజాగా అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టబోయే టైటాన్ స్పేస్ మిషన్ కు ఆమె ఎంపికయ్యింది . ఈ టీమ్ కు నాసా మాజీ వ్యోమగామి రిటైర్డ్ కల్నల్ విలియం మేక్ ఆర్డే జూనియర్ నాయకత్వం వహిస్తున్నారు .
ఈ ప్రాజెక్టులో భాగంగా 2026 నుంచి మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ మిషన్ ద్వారా ఇంటెన్సివ్ వ్యోమగామిగా శిక్షణ పొందుతుంది . తర్వాత 2029 లో టైటాన్ స్పేస్ ఆర్భిటల్ విమానం ద్వారా 5 గంటలపాటు అంతరిక్ష పరిశోధనలు ఉంటాయి
ఇంతకీ జాహ్నవి విజయం వెనుక ఎవరున్నారో తెలుసా ?
ఆమె అమ్మమ్మ లీలావతి
తల్లితండ్రులు విదేశాల్లో ఉండటంతో చిన్నపటినుంచి జాహ్నవి పాలకొల్లులో అమ్మమ్మ దగ్గరే పెరిగి చదువుకుంది
జాహ్నవి లక్ష్యాన్ని అమ్మమ్మ ప్రోత్సహించి ఆమె గొప్ప వ్యోమగామి అవడానికి మార్గం సుగమం చేసింది
పరేష్ తుర్లపాటి