ఎల్బీ నగర్ టు మియాపూర్
సమయం ఉదయం 7 గంటలు
“బాబాయ్ ! ఎక్కడిదాకా వచ్చావ్ ?”
“ఇదిగో ఇప్పుడే ఎల్బీ నగర్ సిగ్నల్ క్రాస్ చేసాం రా ? “
“ఇంత పొద్దున్నే బయలుదేరారు .. మరి బ్రేక్ ఫాస్ట్ సంగతో ?”
“ఇందాక ఎల్బీ నగర్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఆగితేనూ మీ పిన్ని చేసిన చపాతీలు అక్కడే తినేసాం రా”
“సరే లంచ్ కి మా ఇంటికి వచ్చేయండి బాబాయ్”
“సరే గానీ నువ్ మాకోసం పెద్దగా ప్రిపరేషన్ అదీ చేయకు .. ట్రాఫిక్ బాగా ఉంది .. మెల్లిగా వస్తాం లే”
సమయం మధ్యాహ్నం 2 గంటలు
“బాబాయ్ ఎందాకా వచ్చారు ?”
“ఇప్పుడే కూకట్పల్లి జుంక్షన్ దాటాం రా “
“అవునా ! ఆల్రెడీ టైం 2 దాటిపోయింది బాబాయ్ .. మరి మీ లంచ్ ఆలశ్యం అవుతుందేమో ?”
“ఈ హైద్రాబాద్ ట్రాఫిక్ సంగతి ముందే ఊహించి మీ పిన్నిపొద్దున్నే లంచ్ క్యారేజీ కట్టేసిందోయ్ .. ఇందాక కూకట్పల్లి జుంక్షన్లో సిగ్నల్ పడినప్పుడు ఇద్దరం లంచ్ చేసేశాం”
“మరి డిన్నర్ కు మా ఇంట్లో ఏర్పాట్లు చేయమంటావా బాబాయ్ ?”
“వద్దురా .. ఈ ట్రాఫిక్ అస్సలు ముందుకు కదలట్లేదు .. వచ్చేసరికి ఏ అర్ధరాత్రో .. తెల్లారో అయేటట్టుంది .. నువ్వూ , అమ్మాయి మాకోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసేయండి .. అంతగా లేట్ అయ్యేటట్లుంటే నేనూ , పిన్ని నెక్స్ట్ సిగ్నల్ దగ్గర డిన్నర్ కంప్లీట్ చేసేస్తాంలే”
“సరే బాబాయ్ మెల్లిగా రండి .. గుడ్ నైట్ “
“స్పీడ్ గా రావడానికి అవకాశం ఎక్కడుంది నా తలకాయ్ .. మెల్లిగానే వస్తాం లే .. గుడ్ నైట్”
అంటూ ఎఫ్ ఎం రేడియో ఆన్ చేసాడు
ట్రాఫిక్ ఝాములో
సిగ్నల్స్ బ్రేకులో
కారు ప్రయాణం .. కారు ప్రయాణం
ఎవరో హైద్రాబాద్ గాయకుడు కడు శ్రావ్యంగా పాడుతున్నాడు
చూసారుగా హైద్రాబాద్ ట్రాఫిక్ కష్టాలు
ఈ కష్టాలు గమనించే మధ్యప్రదేశ్ కు చెందిన పన్నెండో తరగతి చదువుతున్న కుర్రాడు దేవాన్ష్ త్రివేది 23. 5 లక్షలతో మనుషులను మోసుకెళ్లే డ్రోన్ లను తయారుచేసాడు
2024 డిసెంబర్ లో ఆ డ్రోన్ డెమా న్స్ట్రేషన్ చూసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అతడ్ని ప్రత్యేకంగా అభినందించారు
నిజానికి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించటానికి భవిష్యత్తులో ఇటువంటి హ్యూమన్ ప్యాసింజెర్ డ్రోన్స్ అవసరం చాలా ఉంది
ప్రభుత్వాలు ఇటువంటి కుర్రాళ్లను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారు
అభినందనలు దేవాన్ష్
న్యూస్ సౌజన్యం : గుడ్ ఇన్ఫో ఛానెల్
హైద్రాబాద్ కష్టాలు రాసింది మాత్రం రచ్చబండ కబుర్లు