అమాత్యులైన సామాన్యులు
నరేంద్ర మోడీ , కిషన్ రెడ్డి షుమారు 35 సంవత్సరాల క్రితం ఢిల్లీ బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఒకే గదిలో సహచరులు
విచిత్రమేమిటంటే అదే 35 సంవత్సరాల క్రితం అమెరికాలో అంతర్జాతీయ యువ పొలిటికల్ లీడర్స్ సెమినార్ జరిగినప్పుడు వీరిద్దరూ బీజేపీ పార్టీ తరపున హాజరు అవటమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాసమైన వైట్ హౌస్ ముందు ఇలా ఇతర సామాన్యులతో పాటు ఫోటో కూడా దిగారు
కానీ ఆ రోజు వైట్ హౌస్ ముందు సామాన్య కార్యకర్తలా ఫోటోలు దిగిన మోడీ తరువాతి కాలంలో అదే వైట్ హౌస్ లో భారత ప్రధాని హోదాలో అడుగుపెడతారని ఈ ఫోటో దిగినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు
నరేంద్ర మోడీ భారత దేశ ప్రధానిగా అదే వైట్ హౌస్ లో అడుగుపెట్టటమే కాకుండా తిరిగి మూడో సారి భారత ప్రధానిగా ఎన్నిక కాగా ఆయన సహచరుడు కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలలో కొనసాగుతున్నారు!
రాజకీయాలు నాయకులను ఒక్కోసారి ఊహించని ఎన్నో మలుపులు తిప్పుతుంది అనటానికి ఈ ఫోటోనే సాక్ష్యం !