Home » పుతిన్ సొంత అరస్ తప్ప ఇంకో కారు ఎక్కడు.. అలాంటివాడు మోడీతో కలిసి సాధారణ టొయోట ఫార్చ్యూనర్ కార్ ఎక్కాడు . దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ?

పుతిన్ సొంత అరస్ తప్ప ఇంకో కారు ఎక్కడు.. అలాంటివాడు మోడీతో కలిసి సాధారణ టొయోట ఫార్చ్యూనర్ కార్ ఎక్కాడు . దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ?

Spread the love

రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే

ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే విదేశాంగ మంత్రి జైశంకర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి పుతిన్ ను రిసీవ్ చేసుకోవాలి

కానీ ఆఖరి నిమిషంలో ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మోడీ స్వయంగా వెళ్లి రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికారు

చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పుకి రాజకీయ వర్గాలు ఆశ్చర్య పోయాయి

ఎందుకంటే మారుతున్న ఇండియా , అమెరికా సంబంధాల నేపథ్యంలో ప్రపంచం చూపు ఈ ఇరువురు నేతల మీద పడింది

కానీ ఆ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా మోడీ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు

నిజానికి ఈ ట్విస్ట్ శత్రు దేశాలు అస్సలు ఊహించలేదు
ఊహిస్తే ఈయన నరేంద్ర మోడీ ఎందుకవుతారు ?

మారుతున్న అంతర్జాతీయ దౌత్య సంబంధాల నేపథ్యంలో ప్రధాని సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

ఆపరేషన్ సింధూర్ లో ప్రయోగించిన సైనిక ఆయుధ సంపత్తిలో రష్యా మేక్ ఉత్పత్తులు కూడా ఉన్నాయనేది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం
ఒక రకంగా అవి భారత్ కు గేమ్ ఛేంజర్ గా ఉపయోగపడ్డాయి

ఇది కాకుండా రష్యాతో మనకు ప్రధాన వాణిజ్యం ఇంకోటుంది
అదే ముడి చమురు ఒప్పందం

ఇదే విషయం మీద గతంలో అమెరికా అధ్యక్షుడు భారత్ కు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే

అయినా సరే అటువంటి ఆంక్షలను పట్టించుకోకుండా భారత్ రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కంటిన్యూ చేస్తూనే ఉంది

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు

అందులో భాగంగానే ఆయన స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి రష్యా అధ్యక్షుడిని రిసీవ్ చేసుకున్నారు

రష్యా అధ్యక్షుడి అధికారిక వాహనం

అప్పటికే ప్రత్యేక సైనిక విమానంలో ఇండియా చేరుకున్న రష్యా అధ్యక్షుడి అధికారిక వాహనం అరస్ పుతిన్ ను తీసుకెళ్లడానికి కాన్వాయ్ తో రెడీగా ఉంది

ఇక్కడ ఆయన అధికారిక వాహనం అరస్ గురించి కొద్దిగా చెప్పుకోవాలి

ఒక పక్కన ఉక్రెయిన్ వార్ , మరోపక్క పొంచి ఉన్న అంతర్జాతీయ ఉగ్ర ముప్పు నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో పుతిన్ సొంత జాగ్రత్తలు చాలానే తీసుకున్నాడు

దీనికి తోడు ఆయన చుట్టూ రష్యన్ సెక్యూరిటీ వేయికళ్లతో నీడలా ఫాలో అవుతూ ఉంటుంది

అందుకే భద్రతా కారణాల దృష్ట్యా పుతిన్ అరస్ కారు తప్ప ఇంకో కారు ఎక్కడు

ఎందుకంటే ఈ కారు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన ఫీచర్స్ కలిగి ఉంది

సాంకేతికంగా ప్రపంచంలో మరెవ్వరు డీ కోడ్ చేయలేని అంతర్గత సేఫ్టీ సిస్టం ఇందులో ఇన్ బిల్ట్ అయి ఉంది

ఎంతైనా ఆయన మాజీ కేజీబీ రహస్య గూఢచారి కదా !

అందుకే ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎక్కకుండా తన సొంత అరస్ కారుని తెప్పించుకుని మరీ అందులోనే తిరుగుతాడు

అలా భారత్ పర్యటనకు కూడా ఆయన తన సొంత వాహనాన్ని తెప్పించుకున్నాడు

ఇదిలా ఉండగా సొంత సెక్యూరిటీ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ఈ మాజీ కెజిబి ఏజెంట్ మోడీ పిలవగానే అరస్ ను వదిలేసి సాధారణ ఫార్చ్యూనర్ కార్ ఎందుకు ఎక్కాడు ?

ఈ మార్పులు అప్పటికప్పుడు జరిగాయా ? లేకపోతె ముందుగానే నిర్ణయించిన ప్రకారం జరిగాయా ?

ఒకవేళ ఈ మార్పులు జరగాలన్నా అటు రష్యన్ నేషనల్ సెక్యూరిటీ , ఇటు NSG లు ఒప్పుకోవాలి

మరి ఈ రెండు సెక్యూరిటీ ఏజెన్సీలు ఒప్పుకున్నాయా ?

అసలు అతిధిగా వచ్చిన ఓ అగ్ర దేశం అధినేతను ఫార్చ్యూనర్ కారులో తీసుకెళ్లాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు ?

పై ప్రశ్నలకు అధికారికంగా సమాధానాలు రాకపోయినా అనధికారికంగా రాజకీయ వర్గాల్లోను , సెక్యూరిటీ ఏజెన్సీలలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి

ప్రోటోకాల్ ప్రకారం అయితే రష్యా అధ్యక్షుడు మన దేశానికి అతిధిగా వచ్చాడు కాబట్టి ఆయన రక్షణ బాధ్యతలు పూర్తిగా భారత్ మీదే ఉంటుంది

అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కి భిన్నంగా ఫార్చ్యూనర్ కారులో వెళ్లాలన్న నిర్ణయం ప్రధానికి తెలిసే జరిగిందని ఢిల్లీ వర్గాలు అనధికారికంగా తెలియచేస్తున్నాయి

ఫార్చ్యూనర్ టయోటా కారులో వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి ?

షెడ్యూల్ ప్రకారం పుతిన్ అరస్ కారులోనూ , మోడీ రేంజ్ రోవర్ కారులోనూ ప్రయాణిస్తారని అందరూ అనుకున్నారు

కానీ అకస్మాత్తుగా ఇరువురు నేతలు ఫార్చ్యూనర్ కార్ ఎక్కడంతో అందరూ ఆశ్చర్య పోయారు

దీనివెనుక రకరకాల కధనాలు బయటికి వస్తున్నాయి

ప్రస్తుతం ప్రధాని మోడీ వాడుతున్న రేంజ్ రోవర్ , మెర్సిడెస్ కార్లు ఒకటి UK లో తయారైంది .. రెండోది జర్మన్ తయారీ

ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ రెండు దేశాలు రష్యాకి వ్యతిరేకంగా గళం విప్పాయి

బహుశా పుతిన్ ఆ కార్లు ఎక్కడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు అనేది ఒక కారణంగా భావిస్తున్నారు .

ఫార్చ్యూనర్ కార్ జపాన్ కంపెనీ టయోటా ఒరిజినల్ మేడ్ అయినప్పటికీ ఇండియాలో కర్ణాటకలో పూర్తిస్థాయి ప్లాంట్ ఏర్పాటు చేసి ఇక్కడే కార్లు మాన్యుఫ్యాక్చ్యరింగ్ చేస్తుండటంతో మోడీ మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా ఫార్చ్యూనర్ కార్ వాడారని ఇంకొన్ని కధనాలు నడుస్తున్నాయి

ప్రపంచ దేశాల్లో మారుతున్న భౌగోళిక ఆధిపత్య ధోరణులకు చెక్ పెట్టే విధంగా జపాన్ మేక్ కారుని తెరపైకి కావాలనే తెచ్చారనే ప్రచారం కూడా ఉంది

ఈ ఎపిసోడ్ లో కొన్ని కంపారిజన్స్ చూసుకుంటే ప్రోటోకాల్ ను సైతం పక్కనబెట్టి ప్రధాని స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలకడం అంతర్జాతీయ సమాజంలో ఆయనకి ఇస్తున్న గౌరవం తెలియచేయాలనే ఉద్దేశ్యం స్పృష్టంగా కనిపిస్తుంది

అలాగే పుతిన్ కూడా సొంత సెక్యూరిటీ నిబంధనలను పక్కనబెట్టి టొయోటా కార్ ఎక్కడం ద్వారా ప్రధాని మోడీకి తాను ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచానికి తెలియచేసేలా సంకేతాలు ఇచ్చారు

సెక్యూరిటీ ఏజెన్సీలు ఒప్పుకున్నాయా ?

అరస్ తో పోలిస్తే ఫార్చూనర్ కారులో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువ . అలాంటిది ఆ కారులో ప్రయాణించడానికి రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఒప్పుకున్నాయా ?

ఇందుకు కూడా అనధికారికంగా కొన్ని కధనాలు బయటికి వచ్చాయి

ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని మోడీ ఇంటివరకు వెళ్లే మార్గం రేంజ్ రోవర్ , మెర్సిడెస్ కార్లకు అనుకూలమే కానీ ఇందులో సీటింగ్ ఇబ్బంది ఉందని అంటున్నారు

ఈ కార్లలో మోడీ పక్కన కూర్చోవడానికి పుతిన్ స్థాయికి అనువుగా సీటింగ్ లేకపోవడం వల్లనే కార్ మార్చినట్టు చెప్తున్నారు

అంతేకాదు ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు ఇతర కార్లతో పోలిస్తే ఫార్చ్యూనర్ కారులో త్వరగా తప్పించుకోవడానికి వీలు అవుతుంది అంటున్నారు

ఇదిలా ఉండగా అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సాధారణంగా వివిఐపి లు ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు నెంబర్ ప్లేట్లు కనిపించకుండా బ్లాక్ చేస్తారు

కాన్వాయిలో ఒకే రకమైన కార్లు వాడటం వల్ల వీవిఐపీ ఏ కారులో ఉన్నాడో తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటారు

ఇది రొటీన్ గా జరిగే ప్రక్రియే

కానీ ఈ ఇరువురు నేతలు ప్రయాణించిన ఫార్చ్యూనర్ కార్ నంబర్ ప్లేట్ ఏ మాత్రం మార్చకుండా అలాగే ఉంచారు

పోనీ కాన్వాయిలో అదే రకం నంబర్ ప్లేట్ కార్లు ఇంకో పది వాడారా ? అంటే అదీ లేదు
ఇది చాలా డేరింగ్ నిర్ణయమే

శత్రువులకు హైలీ టార్గెటెడ్ గా ఉన్న ఇరువురు నేతలు నంబర్ ప్లేట్ ఉన్న కారులో విండో గ్లాస్ ఓపెన్ చేసి చేతులు ఊపుతూ ప్రయాణం చేయడం అంటే అత్యంత సాహసోపేతమే అని చెప్పవచ్చు

గతంలో పుతిన్ కారు ఎక్కిన మోడీ

చైనా పర్యటనలో పుతిన్ ప్రోటోకాల్ పక్కనబెట్టి మోడీని తన అరస్ కారులో ఎక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే

సాధారణంగా ఆ కారులో పుతిన్ తప్ప ఇతర దేశాల అధ్యక్షులు ఎవర్నీ ఎక్కించుకున్న చరిత్ర లేదు

మొదటిసారిగా పుతిన్ ఆ రికార్డుని బ్రేక్ చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఎక్కించుకుని షుమారు ముప్పై నిమిషాల పాటు మాట్లాడటం ద్వారా ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు

ఈ రకంగా చూసుకుంటే చైనా పర్యటనలో పుతిన్ తనకిచ్చిన గౌరవానికి బదులుగా ఇండియా పర్యటనలో ఆయన్ని మోడీ తన కారులో ఎక్కించుకుని తిరిగారా అనిపిస్తుంది

ఈ సంఘటనలు బలపడుతున్న ఇరు దేశాల స్నేహ సంబంధాలను గుర్తు చేస్తుంది

గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో సోవియట్ రష్యాతో చక్కటి స్నేహ సంబంధాలను మెయింటైన్ చేసేవారు

అప్పట్లో దౌత్య పరంగా అమెరికాతో పోలిస్తే రష్యాతోనే ఆమె ఎక్కువగా సుహృద్భావ పూరిత సంబంధాలను కొనసాగించేవారు

ఆమె హయాంలో పాకిస్తాన్ తో జరిగిన వార్ లో కూడా రష్యా భారత్ వైపే మద్దతుగా నిలబడింది

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కొన్ని దశాబ్దాల తర్వాత తిరిగి భారత్ , రష్యా సంబంధాలలో కొత్త అధ్యాయాలు మొదలౌతున్నాయి అనిపిస్తుంది

పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో రష్యాతో ఆయుధ ఒప్పందాలు కొనసాగించడం భారత్ కు ప్రాధాన్యతతో కూడుకున్న అంశం అనేది ఎవరూ కాదనలేని సత్యం

దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న రేట్ల దృష్ట్యా ఆ దేశంతో మనకు ప్రధానమైనటువంటి ముడి చమురు వాణిజ్యం కొనసాగించడం తప్పనిసరి

కారణాలు ఏమైనప్పటికీ అరస్ కారు తప్ప ఇంకో కారు ఎక్కని పుతిన్ సైతం మోడీ మాట మీద గౌరవంతో మొదటిసారి ఫార్చ్యూనర్ కారు ఎక్కడం విశేషమే !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!