నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది
ఇటీవల ప్రధాని మోడీ SCO సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా వెళ్ళినప్పుడు అయన హత్యకు పన్నిన భయంకరమైన కుట్ర కోణాన్ని రష్యన్ నిఘా వర్గాలు ఛేదించినట్టు కధనాలు వెల్లువెత్తుతున్నాయి
మరోపక్క మెయిన్ స్ట్రీమ్ లో ఈ వార్తల గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు
బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ వార్తను ఖండించకుండా ట్రేండింగ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అసలు విషయమేంటో చూద్దాం
సోషల్ మీడియా కధనాల ప్రకారం ,
SCO సమ్మిట్ లో పాల్గొనేందుకు చైనా వచ్చిన ప్రధాని మోడీని హత్య చేయడానికి కుట్రలు జరిగాయని రష్యా నిఘా వర్గాలు పసిగట్టాయి
విషయం తెలుసుకున్న పుతిన్ క్షణం ఆలస్యం చేయకుండా మోడీని అలర్ట్ చేయడానికి ఆయన బస చేసిన హోటల్ కు హుటాహుటిన వెళ్ళాడు
హోటల్ నుంచి మోడీ బయటకు వచ్చేవరకు షుమారు 15 నిమిషాల పాటు పుతిన్ తన కారులోనే వేచి ఉన్నాడు
ఇది అంతర్జాతీయ ప్రోటోకాల్ కు విరుద్ధం
అయినా పుతిన్ ఆ ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మోడీ కోసం వెయిట్ చేసారు
మోడీ బయటికి రాగానే పుతిన్ ఆయన్ని తన కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు
అప్పటికే మోడీ కోసం సిద్ధం చేసిన కారు అక్కడే ఆగిపోయింది
హోటల్ బయట పుతిన్ వేచి ఉన్న సమయంలో రష్యన్ భద్రతాదళాలు హోటల్ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టాయి
దానితో స్థానిక మీడియాకు అనుమానం వచ్చింది
ఏదో అత్యవసర సందేశం అందబట్టే పుతిన్ స్వయంగా హోటల్ కు వచ్చి అయన కారులో మోడీని ఎక్కించుకుని బయలుదేరాడని పసిగట్టాయి
ఇలా ఉండగా మోడీని కారులో ఎక్కించుకున్న పుతిన్ ఆయన్ని నేరుగా సమావేశానికి తీసుకెళ్లకుండా షుమారు ముప్పై నిముషాలు కారులోనే చక్కర్లు కొట్టడంతో వారి అనుమానం మరింత బలపడింది
మోడీ మీద జరిగిన కుట్ర గురించి పుతిన్ ఆయన్ని కారులోనే అలర్ట్ చేసాడని అనుకుంటున్నారు
దీనికి ముందు జరిగిన ఓ సంఘటన కుట్ర కోణానికి ఊతమిచ్చేలా ఉంది
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన ఓ అధికారి హత్య కు గురయ్యాడు
సాధారణంగా తమ దేశంలో ఎవరైనా హత్యకు గురైతే లోకల్ పోలీసులు ఆ కేసునుప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే సంబంధీకులకు అప్పచెబుతారు
కానీ ఈ కేసులో అటువంటి ఫార్మాలిటీస్ కు అవకాశం ఇవ్వకుండా అమెరికన్ ఎంబీసీ అధికారులు అతడి డెడ్ బాడీని ఎటువంటి పోస్ట్ మార్టంలు లేకుండానే తరలించారు
ఈ సంఘటన కొన్ని అనుమానాలను , ప్రశ్నలను లేవనెత్తాయి
రష్యన్ గూఢచారుల కధనం ప్రకారం అమెరికన్ ఏజెంట్ మోడీని అంతమొందించడానికి కుట్ర చేస్తున్న క్రమంలో అంతమొందించబడ్డాడు
ఈ వివరాలన్నీ గూఢచారులు పుతిన్ చెవిలో వేయడంతో అయన మోడీకి స్నేహ హస్తం అందించి అలర్ట్ చేయడమే కాకుండా చైనా పర్యటన ఆసాంతం వేయి కళ్ళతో కనిపెట్టి కాపాడాడని కధనాలు బయటికి వచ్చాయి
ఈ కధనాలు అధికారికంగా నిర్దారించకపోయినప్పటికీ చైనా పర్యటన ముగించుకుని ఇండియాకి వచ్చిన మోడీ ఓ సదస్సులో మాట్లాడిన మాటలు సంచలనం కలిగించడమే కాకుండా పై కధనాలు నిజమే అయిఉండొచ్చన్న అనుమానాలను రేకెత్తించింది
ఇంతకీ మోడీ ఏం మాట్లాడారు అంటారా ? ,
” ఇటీవల నేను చైనా లో విజయవంతంగా పర్యటన ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చాను ” అనగానే ఆడియన్స్ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసారు
అప్పుడు నరేంద్ర మోడీ చిన్నగా నవ్వూతూ ” నేను ఇండియాకి తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా ?” అని సభికులను ఎదురు ప్రశ్నించడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆశర్య పోయారు
మోడీ మాటల్లో ఏదో గూఢార్థం ఉందని .. తనపై జరిగిన కుట్ర గురించి తెలుసు కాబట్టే అన్యాపదేశంగా ఆ మాటలు వాడారని బీజేపీ అభిమానులు అనుకుంటున్నారు !
