గతంలో ముంబై తాజ్ హోటల్ దాడుల వీడియో ఫుటేజీలు మనం వార్తల్లో చూసాం
తాజ్ హోటల్లో ఉగ్ర దాడులను , దాన్ని మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు చెందిన కమెండోలు ఎలా ఛేదించారో తెలుగులో తీసిన మేజర్ సినిమాలో కూడా చూపించారు
అలంటి సినిమా సన్నివేశాలను తలదన్నే సంఘటన ఒకటి ముంబైలో జరిగింది
వివరాల్లోకి వెళ్తే ,
ముంబై పోలీసులకు గురువారం మధ్యాహ్నం ఓ కాల్ వచ్చింది
ముంబైలోని పోవై ప్రాంతంలోని RA స్టూడియోలో 19 మందిని ఓ కిడ్నాపర్ బంధించి యేవో డిమాండ్లు చేస్తున్నాడనేది ఆ కాల్ సారాంశం
ఈ 19 మందిలో 17 మంది 15 సంవత్సరాల వయసున్న పిల్లలు , ఇద్దరు వృద్దులు ఉన్నట్టు తెలిసింది
మొదట పోలీసులు కిడ్నాపర్ డబ్బుల కోసమే ఈ బెదిరింపులను చేస్తున్నాడు అనుకున్నారు
స్టూడియోలో ఎక్కువమంది బందీలుగా ఉండటంతో పోలీసులు కమెండోలను రంగంలోకి దించారు
అప్పటికప్పుడు 8 మంది కమెండోలు స్టూడియో పరిసర ప్రాంతాలకు బయలుదేరారు
అయితే ఆ స్టూడియోకి వెళ్లే దారి ఇరుకుగా ఉండటంతో కమెండోలు వాహనాలు దూరంగా నిలిపి కిడ్నాపర్ తో చర్చల కోసం ప్రయత్నించారు
కిడ్నాపర్ మానసిక పరిస్థితి సరిగా ఉందా ? లేకపోతె ఉన్మాదంలో ఉన్నాడా ? తెలుసుకోవడం కోసం కమెండో లీడర్ అతడ్ని మాటల్లో పెట్టడం కోసం మైకులో రిక్వెస్ట్ చేసాడు
కమెండో లీడర్ మాటలకు స్పందించిన కిడ్నాపర్ వీడియో కాల్ లో మాట్లాడటానికి ఒప్పుకున్నాడు
వీడియో కాల్ లో స్టూడియో లోపల అతడు బంధించిన 19 మంది చిన్న గదిలో భయం , భయంగా బిక్కు బిక్కు మంటూ కనిపించారు
కిడ్నాపర్ చేతిలో రివాల్వర్ ఉంది
అతను ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు
మెల్లిగా కమెండో లీడర్ అతడ్ని మాటల్లో పెట్టాడు
ఈ లోపు మిగిలిన ఏడుగురు కమెండోలు స్టూడియో చుట్టూ రౌండప్ చేసారు
స్టూడియో లోపలికి వెళ్ళడానికి ఒకటే మెయిన్ డోర్ ఉంది
అది బద్దలు కొట్టి వెళితే కిడ్నాపర్ కి తెలిసి ఆ 19 మందిని చంపేసే అవకాశం ఉంది
అందుకే ఆ రిస్క్ తీసుకోలేదు
కిడ్నాపర్ ను లొంగిపొమ్మని కమెండోలు నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు
కానీ కిడ్నాపర్ అందుకు ఒప్పుకోలేదు
అప్పుడు అతడి డిమాండ్లు ఏమిటని అడిగారు కమెండోలు
తన పేరు ఆర్య అని ఈ స్టూడియాలో పనిచేయడంతో పాటు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నానని చెప్పాడు
పూణేకి చెందిన 38 ఏళ్ళ ఆర్య గతంలో మాజీ విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ హయాంలో విద్యాశాఖ కు సంబందించిన ఓ ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్నాడు .. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేసినా తనకు విద్యా శాఖ నుంచి నిధులు రాలేదని , ఈ విషయమై ప్రశ్నించేందుకు మంత్రి నివాసం ఎదుట నిరసన ప్రదర్శన కూడా చేసానని చెప్పాడు .. నేను ఉగ్రవాదిని కాను .. నాకు న్యాయం చేయండి .. లేకపోతె వీళ్ళని చంపేస్తాను” అని బెదిరించాడు
అతడు మాటల్లో ఉండగానే కొంతమంది కమెండోలు ఆ స్టూడియో బాత్ రూమ్ కి ఉన్న వెంటిలేటర్ తొలగించి అతడ్ని రౌండప్ చేసి లొంగిపోమ్మని హెచ్చరించారు
కానీ ఆర్య వినకుండా కమెండో మీద కాల్పులకు ప్రయత్నించాడు
కమెండోలు ఎదురు కాల్పులు జరపడంతో ఆర్య కుప్పకూలిపోయాడు
తర్వాత ఫోరెన్సిక్ బృందాలు స్టూడియోలో ఎయిర్ గన్ , కొన్ని పేలుడు పదార్దాలు స్వాధీనం చేసుకున్నారు
స్టూడియోలో పరిస్థితి చూస్తే మన కమెండోలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అని తెలుస్తుంది
రిస్క్ తీసుకుని ప్రాణాలకు తెగించి మరీ బందీలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన మన కమెండోలకు ప్రజలు సెల్యూట్ కొడుతున్నారు !
