సెక్యూరిటీ గార్డ్ నుంచి 100 కోట్ల మై గేట్ యాప్ కంపెనీ సీఈఓ గా ఎదిగిన అభిషేక్ కుమార్ సక్సెస్ స్టోరీ !
సక్సెస్ అనేది రాత్రికి రాత్రే ఎవర్నీ వరించదు
దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి
కఠోర శ్రమ , పట్టుదల , లక్ష్యాన్ని సాధించాలనే బలమైన సంకల్పం ఉంటుంది
సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి 100 కోట్ల కంపెనీకి సీఈఓ కావడం అంటే మాటలు కాదు
అభిషేక్ ఆ లక్ష్యాన్ని సాధించి చూపాడు
ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో నివసించే చాలామందికి మై గేట్ యాప్ గురించి తెలిసే ఉంటుంది
పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో సెక్యూరిటీ నిర్వహణ పెద్ద టాస్క్
ఎక్కువ ఫ్లాట్స్ ఉండటంతో విజిటర్స్ , సేల్స్ మెన్లు , కొరియర్ వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది
మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక్కొక్కరిని మాన్యువల్ గా ఎంటర్ చేసుకుని పంపటానికి చాలా టైం తీసుకుంటుంది
ఇటువంటి పరిస్థితుల్లో గేటెడ్ అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ నిర్వహణా పద్దతులను సులభతరం చెయ్యాలన్న ఆలోచన నుంచే మై గేట్ యాప్ పుట్టింది
ఈ యాప్ సీఈఓ ఎవరో తెలిస్తే మీరు ఆశర్యపోతారు
ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్
ఎస్ .. మీరు చదివింది నిజమే
మై గేట్ యాప్ సీఈఓ అభిషేక్ కుమార్ గతంలో రోజుకి 14 గంటలపాటు షిఫ్టులలో పనిచేసిన ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్
కుటుంబ పరంగా చూస్తే అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
చదువుల్లో మాత్రం అభిషేక్ టాప్ ర్యాంకర్
చదువులకోసం అయ్యే ఫీజులు కట్టడానికి రాత్రి షిఫ్టులలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసేవాడు
అలాగే కష్టపడి చదువుకుని ఐఐటీ పూర్తిచేసాడు
డబ్బు విలువ , చదువు విలువ , కష్టం విలువ తెలుసు కాబట్టి సొంతంగా తన కాళ్ళమీద తాను నిలబడుతూ తనలాంటి మరోపదిమందికి ఉపాధి కల్పించాలని ఆలోచించాడు
ఏ పని చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తున్న తరుణంలో అంతకుముందు తను పనిచేసిన అపార్టుమెంట్లలో సెక్యూరిటీ ఇబ్బందులు గుర్తుకొచ్చాయి
అటువంటి సమస్యలను సులభతరంగా పరిష్కరించే మార్గంలోనుంచే మై గేట్ యాప్ పుట్టింది
ఈ యాప్ ద్వారా సెక్యూరిటీ సమస్యలే కాకుండా ఇతరత్రా అన్ని సమస్యలకు పరిష్కారం లభించే విధంగా యాప్ కు రూపకల్పన చేసారు
తన ఆలోచనను ఇంకో ఇద్దరు మిత్రులతో పంచుకున్నాడు
వారు కూడా ఆమోదించడంతో 2016 లో మై గేట్ యాప్ ప్రారంభించారు
2022 లో అర్బన్ కంపెనీ – ఏకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల సమీకరణలో కంపెనీ 100 కోట్లు సేకరించింది
2024 లో అభిషేక్ మై గేట్ సీఈఓ అయ్యారు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 30 వేల హోసింగ్ సొసైటీలలో 50 లక్షలకు పైగా వినియోగదారులు మై గేట్ యాప్ ను వినియోగిస్తున్నారు
ఈ యాప్ ప్రతి నెలా షుమారు వంద మిలియన్లకు పైగా చెక్ ఇన్ లను సులభతరం చేస్తుంది
2024 లో ఈ యాప్ ను మరింత అప్ గ్రేడ్ చేసి స్మార్ట్ హోమ్ లాక్ లను ప్రవేశపెట్టి మై గేట్ ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది
2024 లో కంపెనీ ఆదాయం వందకోట్లు దాటింది
2025 లో 200 కోట్ల ఆదాయం లక్ష్యంగా దూసుకుపోతుంది