“సన్యాసం స్వీకరించి తమిళనాడులోని కుర్తాళం పీఠాధిపతి గా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నా “-పీవీ నరసింహారావు
“సన్యాసం స్వీకరించి తమిళనాడులోని కుర్తాళం పీఠాధిపతి గా శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నా “పీవీ నరసింహారావు గారి నోటివెంట అకస్మాత్తుగా వెలువడిన ఆ వాక్యం విని ఉలిక్కిపడ్డాడు ఆయన ఆంతరంగికుడు ! అపర చాణుక్యుడిగా పేరుపడ్డ పీవీ నోటివెంట రాజకీయల్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించాలనే నిర్ణయం ఆయన ఊహించలేదు దేశానికి మీ సేవలు అవసరం కాబట్టి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని చెప్పాలనుకున్నాడు..కానీ గొంతుదాటి మాట బయటకు రాలేదు ఆయనకు చెప్పేంత స్థాయి కానీ అర్హత కానీ తనకు…
