పాలకుల అవినీతి, చైనా అనుకూల వాదం వల్ల హిమాలయన్ దేశం నేపాల్ అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది.
యూరప్ ఖండంలోనో, జపాన్ పక్కనో ఉంటే ఈ పాటికి ప్రపంచంలోని సంపన్న దేశాలలో ఒకటిగా ఎదిగి ఉండేది.
మంచుకొండలు, కళ్లు తిప్పుకేలేని లోతైన లోయలు, పచ్చటి మైదానాలు, చల్లని వాతావరణం నేపాల్ సహజ పంపదలు.
దేశంలో 10 జీవ నదులు ఉన్నాయి. మంచు కరగడం వల్ల వేసవిలోనూ వీటిలో సగం నీటితో ఉరకలెత్తుతుంటాయి.
ఈ జలాలను వినియోగించి 43 వేల మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా రాజకీయ అవినీతి వల్ల పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడంలేదు.
ప్రస్తుతం 3 వేల మెగావాట్ల జల విద్యుత్తు మాత్రమే తయారవుతోంది.
పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఎవరెస్ట్ పర్వతం నేపాల్ లోనే ఉంది.
అయితే సరైన మౌలిక సదుపాయాలు, మినీ ఎయిర్ పోర్టులు, హెలిపాడ్లు, స్టార్ హోటల్స్ లేకపోవడం, పర్వత పాదాల వద్ద అపరిశుభ్రత వల్ల టూరిజం పరంగా బాగా వెనకబడి పోయింది.
నేపాల్ లో సహజవనరులను వినియోగంలోకి తెచ్చి టూరిజం , జల విధ్యుత్ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక వనరులు మెరుగుపడతాయి
జలవిద్యుత్తు, టూరిజం రంగాలను కనీసం రూ.4 లక్షల కోట్లతో గరిష్ట స్థాయిలో అభివృద్ధి చేయగలిగితే ఆదేశంలో వచ్చే పదేళ్లలో పేదరికం అనేది ఉండదు. ఇక ముందైనా ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.
B T Govinda Reddy
