ఆదివారం వస్తే చాలు.. చాలామంది పాటల ప్రేమికులు విజయవాడ అలంకార్ సెంటర్ కి పరుగులు పెట్టేవాళ్ళు
అందుకో కారణం ఉంది
అలంకార్ సెంటర్ బాటా షో రూమ్ రోడ్డులో ఫుట్ పాత్ మీద తెలుపు.. గులాబీ రంగుల్లో రకరకాల పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు.. పుస్తకం ఒక్కింటికి రూపాయి అన్నట్టు గుర్తు
ఈ పుస్తకాల్లో సినిమా పాటలను అందంగా ముద్రించి ఇచ్చేవాళ్ళు.. అప్పట్లో సినీ నటుల అభిమాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉండటంతో ఈ పాటల పుస్తకాల కోసం పెద్ద ఎత్తున జనాలు వచ్చేవాళ్ళు
అలాగే హైదరాబాద్ అబిడ్స్ సెంటర్లోనూ, కోటీ సెంటర్లో కూడా పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు
ఇప్పుడంటే సాహిత్యాన్ని సంగీతం మింగేసి పాటల చరణాలు హోరులో కలిసిపోతున్నాయి కాబట్టి సాహిత్య అభిలాష ఉన్నవాళ్ళు కూడా తగ్గిపోయారు
పైగా డిజిటల్ ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత ముద్రించిన పుస్తకాల పఠనాలు కూడా చాలావరకు తగ్గిపోయాయి
అందుకే ఇప్పుడు పాత పుస్తకాలు అమ్మేవాళ్ళు.. పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు కూడా తగ్గిపోయారు!
పరేష్ తుర్లపాటి