రాహుల్ ఘాటు ప్రశ్నలు.. మోడీ ధీటు జవాబులు .. పార్లమెంటులో సింధూర్.. నిన్న కూడా అదే మాట చెప్పిన ట్రంప్ !

Spread the love

రాహుల్ ఘాటు ప్రశ్నలు.. మోడీ ధీటు జవాబులు .. పార్లమెంటులో సింధూర్ !

నిన్న కూడా అదే మాట చెప్పిన ట్రంప్ !

నిన్న పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ గురించి వాడిగా వేడిగా చర్చ జరిగింది

ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలు ప్రధానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించగా .. మోడీ ధీటుగా సమాధానాలు చెప్పారు

రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ తాను చెప్తేనే భారత్ పాకిస్తాన్ పై కాల్పుల విరమణ పాటించిందని అమెరికా అధ్యక్షుడు చెప్పింది నిజామా ? కాదా ? అనే విషయంపై ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పాలని పట్టుబట్టారు

ఈ విషయం ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా 29 సార్లు అంతర్జాతీయ వేదికల మీద ట్రంప్ చెప్పినప్పటికీ మోడీ మౌనంగా ఎందుకున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు

ఇందిరాగాంధీ దైర్యంలో 50 శాతం అయినా చూపించి ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు .. ఆయన చెబుతున్నవన్నీ అబద్దాలు .. సీజ్ ఫైర్ మా అంతట మేమె పాటించాం అని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు ? ఇది పిరికితనపు చర్య కాదా ? దేశ గౌరవాన్ని , సైనికుల త్యాగాలను ట్రంప్ కాళ్ళ మీద పడేసింది నిజమా ? కాదా ? ఆపరేషన్ సింధూర్ లో పాక్ సైనిక స్థావరాలపై భారత్ దాడులు ఎందుకు చేయలేకపోయింది ? గత పార్లమెంట్ సమావేశాల్లోనే చైనా , పాక్ లు కలిసి భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి .. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి జాగ్రత్తలు తీసుకోండి అని హెచ్చరించినా సైనిక దళాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు ? ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మనం 6 యుద్ధ విమానాలను కోల్పోయాం .. జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు .. ఇవన్నీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం కాదా ? అని రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో విరుచుకుపడ్డారు

రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ’ 44 ఏళ్లకే భర్తను కోల్పోయిన బాధ ఏంటో తన తల్లికి తెలుసనీ .. అలాగే పహల్గామ్ దుర్గ్టనలో భర్తలను కోల్పోయిన బాధితుల బాధ ఈ ప్రభుత్వానికి అర్థమౌతుందా ? అని ప్రశ్నించారు

ఈ ప్రశ్నలకు పార్లమెంట్ సాక్షిగా మోడీ ధీటుగా సమాధానాలు ఇచ్చారు

‘ అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ మీ దేశంపై యుద్దానికి సిద్ధం అవుతుంది అని చెప్పారు
దానికి నేను ఏమి సమాధానం చెప్పానో తెలుసా ? ఒకవేళ పాకిస్తాన్ అటువంటి దుస్సాహసానికి ఒడిగడితే భారత్ చూస్తూ ఊరుకోదు .. పాకిస్తాన్ తగిన భారీ మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పాను

ఇక ఆపరేషన్ సింధూర్ ఆపేయమని ప్రపంచంలో ఏ దేశ నేతా నాకు చెప్పలేదు .. భారత్ దాడులు మొదలుపెట్టిన మూడు రోజులకు పాకిస్తాన్ డిజిఎంఒ మన సైనిక అధికారులకు ఫోన్ చేసి ప్లీజ్ ప్లీజ్ యుద్ధం ఆపేయండి అని బతిమిలాడితేనే దాడులను ఆపాం

గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోయింది .. కానీ మేము వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి

ఉగ్రవాదులతో పాటు సూత్రధారులను కూడా మట్టుబెడుతున్నాం

ప్రపంచంలో 190 దేశాలు ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా మాట్లాడితే కేవలం మూడు దేశాలే పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచాయి

ఇక పాకిస్తాన్ ఎయిర్ బేస్ స్థావరాలపై భారత్ చేసిన దాడులతో ప్రస్తుతం అవన్నీ ఐసీయూ లో ఉన్నాయి

ఇకనుంచి పాక్ న్యూక్లియర్ బెదిరింపులను మేము లెక్క చెయ్యం .. ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను కూడా ఉగ్ర దేశంగా పరిగణిస్తాం ‘ అని ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చలో ప్రధాని మోడీ తమ వైఖరిని స్పృష్టం చేసారు

కొసమెరుపు : తాజాగా అమెరికా అధ్యక్షుడు నిన్న కూడా ఓ మీడియాతో మాట్లాడుతూ’ తాను చెప్తేనే భారత్ పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ కు ఒప్పుకుందని చెప్పారు ( రాహుల్ గాంధీ లెక్కలప్రకారం ఇప్పటివరకు చెప్పిన 29 కి ఇది కూడా కలిపితే ట్రంప్ మొత్తం ముప్పై సార్లు సీజ్ ఫైర్ కి తాను చెప్పడం వల్లనే మోడీ ఒప్పుకున్నాడని చెప్పినట్టు అయ్యింది )


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!