బ్రాహ్మణులే రష్యా చమురు కొని కోట్ల లాభాలు గడిస్తున్నారు – ట్రంప్ సలహాదారు పీటర్ నవారో
వెర్రి వేయి విధాలు అన్నారుగా మన పెద్దలు
అందులో అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ది కూడా ఒకటి
ప్రస్తుతం ఆయన బ్రాహ్మణుల మీద చేసిన వాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి
బ్రాహ్మణులు భారతీయులను పణంగా పెట్టి రష్యా చమురు కొనుగోలు చేసి లాభాలు గడిస్తున్నారని వెంటనే దీనిని ఆపాలని ఆయన పిలుపునిచ్చారు
ఆయన ఆదివారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ” ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ , చైనా అధ్యక్షుడు గిం పింగ్ లకు ఎందుకు సహకరిస్తున్నారో అర్ధం కావడం లేదని” అన్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వరకు మోడీ నాకు మంచి మిత్రుడు అని బహిరంగంగా చెప్పిన ట్రంప్ అధికార పీఠంలో కూర్చున్న తర్వాత ఇండియా పై తన వైఖరిని మార్చుకున్నారు
సుంకాల పేరుతొ బెదిరించి ఇండియాని తన దారిలోకి తీసుకురావాలని అనుకున్నారు
దీనికితోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు రష్యా , ఉక్రెయిన్ వార్ లో యుద్దానికి వ్యతిరేకంగా ఇండియా తటస్థ వైఖరి అవలంబించడంతో పాటు రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్ కు నచ్చలేదు
దానితో ఇండియా పై భారీగా సుంకాలు విధించారు
మొదట 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఇండియా రష్యా వద్దనుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటం పట్ల ఆగ్రహం చెంది అదనంగా ఇంకో 25 శాతం సుంకం విధించారు
ఈ సుంకాల ప్రభావం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మోడీ చైనాలో పుతిన్ మరియు జిన్ పింగ్ లతో చర్చలు జరపడం సహజంగా అగ్ర రాజ్యానికి ఆగ్రహం తెప్పించింది
దరిమిలా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో బ్రాహ్మణుల మీద , భారతీయుల మీద సంచలన వాఖ్యలు చేసారు
పీటర్ వాఖ్యలకు భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పింది
చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనడం అనేది ఏ దేశమైనా చేసే పనేనని , ఆ మాటకొస్తే చైనా కూడా రష్యానుంచి చమురు కొంటుందని అలాంటిది చైనాని టార్గెట్ చేయకుండా కేవలం ఇండియాని మాత్రమే టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించింది
అయినా పీటర్ నవారో మాట్లాడుతూ భారతీయులది అహంకార మనస్తత్వమని , మా మాటలు లక్ష్యపెట్టకుండా మేము చమురు ఎవరిదగ్గరినుంచైనా కొనుక్కుంటామని మొండిగా వ్యవహరిస్తోంది .. అదే మీ విధానం అయితే అలాగే కానివ్వండి..కానీ మేము విధించే సుంకాలను కూడా మీరు భరించాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు
తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఇండియా , భారత్ ల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయని అర్ధమౌతుంది
భారత్ పట్ల అమెరికా వైఖరి సృష్టంగానే ఉంది
ఇక తేల్చుకోవాల్సింది భారత్ మాత్రమే !