పింగళి దశరధ రామ్ హత్య వార్త తెలిసిన వెంటనే అయన భార్య సుశీల (26 ) నిశ్చేస్తురాలు అయిపొయింది
అప్పటికి ఆమె 6 నెలల గర్భవతి
ఒక బాబు , ఒక పాప .. ఇద్దరూ చిన్న పిల్లలు
నాలుగు రోడ్ల కూడలిలో ఆమె జీవితం ప్రశ్నర్ధకంగా నిలిచిపోయింది
చేతిలో చిల్లిగవ్వ లేదు
కడుపులో బిడ్డ , చేతిలో బిడ్డలు
ఇంకొకరైతే ఆ క్షణానే జీవితాన్ని అంతం చేసుకునేవారు
కానీ పిల్లల కోసం ఆమె దైర్యంగా నిలబడింది
దశరధ రామ్ హత్య తర్వాత ఆమె కొంతకాలం ఎన్కౌంటర్ మ్యాగజైన్ నడిపారు
కానీ ఆర్థిక వనరుల లేమితో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు
దశరథ రామ్ ను హత్య చేసిన నిందితులకు శిక్ష పడి తన కుటుంబానికి న్యాయం జరగాలని పింగళి వెంకయ్య గారి కోడలు .. దశరథ రామ్ తల్లి అయిన జానకమ్మతో కలిసి ఆరేళ్ళ పాటు కోర్టులు , న్యాయవాదుల చుట్టూ తిరిగింది
కొంతమంది పింగళి దశరధ రామ్ వ్యాపార భాగస్వాములే ఈ హత్య చేసారు అన్నారు
మరికొంతమంది ఎన్కౌంటర్ మ్యాగజైన్ పోటీ పత్రిక యజమానులు ఈ హత్య చేయించారు అన్నారు
ఇంకొంతమంది అప్పటి ప్రభుత్వమే ఈ హత్య చేయించింది అన్నారు
చివరికి పోలీసులు దర్యాప్తు చేసి పింగళి దశరధ రామ్ వ్యాపార భాగస్వామి తోట రాము ( ఇతను ఎన్కౌంటర్ మ్యాగజైన్ సర్క్యులేషన్ వ్యవహారాలు చూసేవాడు ) మరో ముగ్గురు కలిసి హత్య చేసారని కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు
కానీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలే కదా
దశరథ రామ్ ను తీసుకొచ్చిన రిక్షా వాలా కూడా తాను నిందితులను గుర్తు పట్టలేను అని సాక్ష్యం చెప్పడంతో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్ట్ కేసు కొట్టేసింది
దశరథ రామ్ హత్య తర్వాత సంతాప సభలు పెట్టిన జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆయన భార్యకు ఎటువంటి సాయం చేయలేకపోయాయి
ప్రభుత్వం సంగతి సరేసరి
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి మనవడి కోటాలో కూడా ఆ కుటుంబానికి ఎటువంటి సాయం చేయలేదు
ఆ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ్డు పింగళి వెంకయ్య గారి గౌరవార్థం ఏపీ ప్రభుత్వం 40 లక్షల చెక్కును ఆయన కూతురు కూతురికి ఇచ్చారు ( నిజానికి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్థికంగా సెటిల్ అయ్యారని తెలుస్తుంది )
అందులో వెంకయ్య గారికి కొడుకు కొడుకైన పింగళి దశరథ రామ్ కుటుంబానికి ఒక్క రూపాయి కూడా రాలేదు
సరే దశరథ రామ్ హత్య తర్వాత సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇద్దరు చంటి పిల్లలతో అప్పటికే గర్భవతిగా ఉన్న సుశీల సత్యనారాయణ పురంలోనే మెడికల్ షాపులోనూ , ఇతర షాపుల్లోనూ పనిచేసి పిల్లలకు తిండి పెట్టి తను నీళ్లు తాగి పస్తులున్న రోజులు ఉన్నాయి
పిల్లల భవిష్యత్ కోసం ఆమె దైర్యంగా ఉండటం అలవాటు చేసుకుంది
జర్నలిస్ట్ సంఘాల నుంచి కానీ , ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సాయం అందకపోవడంతో ఆమె సొంతంగా పరీక్షలు రాసి నందిగామలో బాలికల హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగం సంపాదించుకుని పిల్లలను చదివించుకుంది
తన చిన్న కుమారుడికి దశరథ రామ్ పేరు పెట్టుకుంది
ఆమె ఉద్యోగ జీవితంలో కూడా చాలా అవమానాలు పడింది
పింగళి దశరథ రామ్ భార్య అని తెలియగానే కులం పేరుతొ కొందరు ఆమెను దూషించారు
స్థానికులు చాలామంది ఆమె కనిపిస్తే చాలు ముఖం చాటేసేవాళ్ళు
అన్ని అవమానాలను దిగమింగి తనకొచ్చే సంపాదనతో పిల్లల్ని చదివి పెద్ద చేసింది
ప్రస్తుతం కొడుకులు ఇద్దరూ విజయవాడలోనే తల్లి దగ్గర ఉంటున్నారు
కుబేర సినిమాకు కో రైటర్ గా చేసిన పింగళి చైతన్య పింగళి దశరథ రామ్ కూతురే
పింగళి దశరథ రామ్ చిన్న కొడుకు దశరథ రామ్ ప్రస్తుతం విజయవాడలోనే ఎలెక్ట్రికల్ పనులు చేసుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు
ప్రభుత్వానికి పింగళి దశరథ రామ్ మీద ఉన్న వ్యతిరేక భావం ఇప్పటికీ తమ కుటుంబాన్ని నీడలా వెన్నాడుతుందని ఆయన భార్య సుశీల ఆవేదన చెందుతున్నారు
ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఈమె కుటుంబాన్ని పింగళి వెంకయ్య గారి కోటాలో అయినా సరే సాయం చేయడంతో పాటు దశరధ రామ్ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఆయన అభిమానులు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు !
(ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు )
