దేశీయ వాణిజ్య ప్రకటనల రంగంలో అత్యంత క్రియేటివ్ యాడ్స్ కు రూపకల్పన చేసి కంపెనీలను , వినియోగదారులను సైతం మెప్పించిన పీయూష్ పాండే శుక్రవారం నాడు తన 70 ఏట మరణించారు
ఈయన మరణం దేశ వాణిజ్య రంగాన్ని కదిలించింది
ప్రధాని సహా పలువురు మంత్రులు అయన మృతికి సంతాపం ప్రకటించారు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే ఏకంగా పీయూష్ అంత్యక్రియలకు వెళ్ళాడు
అసలు ఎవరీ పీయూష్ పాండే ? అయన ఎందుకింత పాపులర్ అయ్యారు ? తెలుసుకోవాలంటే కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి
1982 లో ఒగల్వి ఇండియా అనే యాడ్ ఏజెన్సీ లో పీయూష్ చిన్న జాబ్ లో చేరాడు
అనతికాలంలోనే క్రియేటివ్ యాడ్స్ కు రూపకల్పన చేసి అదే కంపెనీ లో అంతర్జాతీయ క్రియేటివ్ యాడ్స్ చీఫ్ స్థాయికి ఎదిగారు
భారతీయ వాణిజ్య ప్రకటనలకు ఈయన తనదైన శైలిలో సున్నిత హాస్యాన్ని జోడించి సింపుల్ ట్యాగ్ లైన్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు
ఏ సోషల్ మీడియాలు లేని రోజుల్లోనే ఈయన యాడ్స్ దీపావళి టపాసుల్లా పేలాయి
క్యాడ్ బరీ యాడ్ లో ‘ కుచ్ ఖాస్ హై ‘ అని , ఆసియన్ పెయింట్స్ కి ‘ హర్ ఖుషీ మే రంగ్ లాయే ‘ అని సింపుల్ లైన్ తో క్రియేట్ చేసిన ఆ యాడ్స్ సూపర్ క్లిక్ అయ్యాయి
గుడ్డు తో వచ్చిన ఫెవికాల్ యాడ్ అయితే తిరుగులేని వ్యూయర్షిప్ ని సంపాదించుకుంది
అన్నిటికన్నా ముఖ్యమైన 2014 లో సంచలనం సృష్టించిన’ ఆబ్ కి బార్ మోడీ సర్కార్ ‘ స్లోగన్ సృష్టికర్త ఈయనే
అప్పట్లో ఈ నినాదం బీజేపీలో సంచలనం సృష్టించింది
ఎంతలా అంటే సామాన్య కార్యకర్తలనుంచి బీజేపీ అధినాయకుల వరకు అదే స్లోగన్ ను వల్లె వేశారు
ప్రకటనల రంగంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 2016 లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది !
