మేడ్ ఇన్ ఇండియా మన నినాదం కావాలి – ఇకపై జీఎస్టీ లో 5 % , 18% స్లాబులే ఉంటాయి – జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి టీవీల్లో ప్రసంగించారు
మోడీ తన ప్రసంగంలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు
మొదటిది జీఎస్టీ సంస్కరణలు
ఇకపై జీఎస్టీ లో 5% , 18% స్లాబులే ఉంటాయని ఆయన చెప్పారు
ప్రభుత్వం తీసుకొచ్చిన టాక్స్ సంస్కరణల ద్వారా ప్రజలకు 2. 5 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఆయన చెప్పారు
రేపట్నుంచి దసరా శరన్నవరాత్రులు మొదలౌతున్న సందర్భంగా జీఎస్టీ సంస్కరణల అమలును మొదలు పెడుతున్నామని , తద్వారా వస్తువుల ధరలు తగ్గుతాయి అని ఆయన చెప్పారు
ఈ సంస్కరణల వలన 90 శాతం వస్తువుల ధరలు తగ్గుతాయి
పన్నుల సంస్కరణలతో పర్యాటక రంగానికి ప్రోత్సాహం పెరుగుతుందని ఆయన అన్నారు
ఇది పండుగ వేల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బొనాంజా గా భావించాలని ఆయన చెప్పారు
రెండోది మేడ్ ఇన్ ఇండియా
ఇకపై మేడ్ ఇండియా మన నినాదం కావాలని , అందరం స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలని అందులో భాగంగా
స్వదేశీ అభియాన్ లో రాష్ట్రాలు ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు
విదేశీ వస్తువుల వినియోగం తగ్గించి దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రజలు సిద్ధం కావాలని ఆయన అన్నారు
ఇందుకోసం ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ చేయాలి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు
