Home » ఇది కదా భారత జట్టు అసలైన స్ఫూర్తి .. నిజంగా కంట తడి పెట్టించే దృశ్యం!

ఇది కదా భారత జట్టు అసలైన స్ఫూర్తి .. నిజంగా కంట తడి పెట్టించే దృశ్యం!

Spread the love

వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో స్టేడియంలో సంబరాలు జరుగుతుండగా పెవిలియన్లో కూర్చుని చూస్తున్న ప్రతీక ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది .. ఆమెను చూసిన జట్టు ఏం చేసింది .. నిజంగా కంట తడి పెట్టించే సన్నివేశం !

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ పోటీల్లో టీమిండియా గెలవగానే కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో సహా జట్టు సభ్యులందరూ మైదానంలోనే భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు

భారత్ గెలుపును పెవిలియన్ నుంచి వీల్ చైర్లో చూసిన ప్రతీక రావల్ అయితే భావోద్వేగం ఆపుకోలేక పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది

అప్పుడు భారత్ జట్టు ఆమె పట్ల స్పందించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది

ఇక్కడ ప్రతీక గురించి కొద్దిగా చెప్పుకోవాలి

ఇండియన్ ఉమెన్స్ టీమ్ లో ఓపెనర్ గా మైదానంలోకి దిగిన ప్రతీక మొదటినుంచి చక్కటి ఫామ్ ను ప్రదర్శిస్తూ వస్తుంది

ఈ టోర్నమెంట్లో ఆమె అర్ద సెంచరీ , సెంచరీతో సహా మొత్తం 308 పరుగులతో ఇండియన్ టీమ్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండవ క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసుకుంది

ఇండియా ఫైనల్ కు చేరుకోవడంలో ప్రతీక పాత్ర కూడా ఉంది

అయితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆమెకు చీలమండలంలో గాయం అవడం వల్ల ఆట నుంచి నిష్క్రమించి హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చింది

ఆమె స్థానంలో వచ్చిన షఫాలీ వర్మ సౌత్ ఆఫ్రికాతో చిచ్చర పిడుగులా తలపడి 87 పరుగులు చేసి భారత్ విజయానికి మార్గం సుగమం చేసింది

ఇదిలా ఉండగా కాలికి అయిన గాయానికి కట్టు కట్టి ప్రతీక ను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.. కానీ ఆమె మనసు మాత్రం స్టేడియంలోనే ఉండిపోయింది .. అందుకే డాక్టర్లు చెప్పినా వినకుండా మొండిగా వీల్ చైర్లో స్టేడియానికి వచ్చి కూర్చుని మ్యాచ్ చూడటం మొదలుపెట్టింది .. చివరికి భారత్ గెలుపును పెవిలియన్ నుంచి చూసిన ప్రతీక ఇండియా జెండాను తన భుజం మీద వేసుకుని భావోద్వేగంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది

గాయం కారణంగా ప్రతీక ఫైనల్లో ఆడలేకపోయినప్పటికీ టెక్నికల్ గా ఆమె టీమ్ లో ఉన్నట్టే లెక్క
భారత్ విజయంలో ఆమెకు కూడా పాత్ర ఉంది

అందుకే భావోద్వేగంతో గ్రౌండ్లో ఉన్న జట్టు సభ్యులు వెంటనే తేరుకుని పరుగున ప్రతీక వద్దకు వెళ్లి వీల్ చైర్లో ఆమెను స్టేడియంలోకి తీసుకొచ్చి కప్ చేతిలో పెట్టారు

నిజంగా ఈ దృశ్యం కోట్లాది భారతీయుల హృదయాలను టచ్ చేసింది

ఇది కదా క్రీడా స్ఫూర్తి
ఇది కదా టీమ్ ఐక్యత

గాయం కారణంగా ఫైనల్లో ఆడలేకపోయినా భారత్ గెలుపులో ప్రతీక పాత్ర కూడా ఉందని కెప్టెన్ హర్మన్ తో సహా జట్టు సభ్యులు ప్రపంచానికి యెంత చక్కగా చెప్పారు

ప్రతీక అయితే ఆనందం తట్టుకోలేక వీల్ ఛైర్లోనుంచే సహచర జట్టు సభ్యులతో భాంగ్రా నృత్యం చేసింది

టీవీల్లో చూసిన కోట్లాదిమంది హృదయాలను ఈ దృశ్యం నిజంగా కదిలించింది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *