హర్యానాలోని అంబాలాలోని వైమానిక దళ స్థావరాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము IAF అధికారిణి శివంగి సింగ్ తో కలిసి యూనిఫార్మ్ వేసుకుని ఫోటోలు దిగారు .
ప్రస్తుతం ఈ పిక్ లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి
రాష్ట్రపతి యూనిఫార్మ్ వేసుకోవడం అసలు వార్త కాదు
అసలు వార్త వేరే ఉంది
ఈ సంవత్సరం మే లో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యం భారత యుద్ధ విమానాన్ని కూల్చివేశాయని , అందులో ఒక ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారిణి ని పట్టుకున్నామని పాక్ మీడియా మెయిన్ స్ట్రీమ్ లోనూ , సోషల్ మీడియాలోనూ తెగ ప్రచారం చేసుకున్నారు
ఆ ప్రచారానికి ” మీవన్నీ తప్పుడు ప్రచారాలే .. ఇదిగో మా యుద్ధ విమానం .. ఇదిగో మా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ శివంగి ” అన్నట్టుగా పాక్ కి గట్టి సందేశం ఇచ్చే విధంగా కౌంటర్ ఇచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అదీ ఈ పిక్ వెనుకున్న అసలు సందేశం !
