22 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ .. సాయం ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా అభినందించాల్సిందే !
గొప్ప మనసు ఉండటానికి గొప్ప మనిషే అవ్వక్కర్లేదు .. ఎదుటివాడికి సాయం చెయ్యాలన్న ఆశయం ఉంటే చాలు
సాయం చేసే మనిషి రాజకీయనాయకుడు అవనీ.. సాధారణ పౌరుడు అవనీ చేసిన సాయాన్ని మనం మనఃస్ఫూర్తిగా స్వాగతించాల్సిందే
రాజకీయాల్లో ఆరోపణలు .. ప్రత్యారోపణలు సహజం
అవి రోజూ మనం చూస్తున్నవే
అయితే ఆరోపణలలోని నిజానిజాలను బట్టి ఆయా నాయకులపై మనం ఒక అంచనాకు వస్తాం
అదే సమయంలో రాజకీయనాయకులు మంచి కార్యక్రమం చేస్తే పార్టీలకు అతీతంగా అభినందిస్తాం
ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అటువంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు
ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్ సెక్టార్ లో ప్రజలపై పాకిస్తాన్ విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది
ఆ కాల్పుల్లో సాధారణ పౌరులు చనిపోయి కొంతమంది పిల్లలు ఆనాధలు అయ్యారు
ఇటీవల రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో పాక్ దాడుల్లో గాయపడిన కుటుంబాలను పరామర్శించారు
ఈ పర్యటనలో తల్లితండ్రులను కోల్పోయి కొంతమంది పిల్లలు ఆనాధలు అయ్యారని తెలుసుకున్న రాహుల్ గాంధీ చలించిపోయారు
వెంటనే అనాథలైన పిల్లల తాలూకు లిస్ట్ తనకు పంపించాల్సిందిగా జమ్మూ కాశ్మీర్ చీఫ్ ను ఆదేశించారు
దానితో ఆయన 22 మంది పిల్లల జాబితా సిద్ధం చేసి రాహుల్ గాంధీకి పంపించారు
ఈ 22 మంది పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు విద్య , వైద్యం , మనుగడకు అయ్యే మొత్తం ఖర్చు రాహుల్ గాంధీ భరిస్తారని ఆయన చెప్పారు
చిన్నారులకు రాహుల్ గాంధీ చేస్తున్న సాయం పట్ల పలువురు రాజకీయాలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు !