దీపావళి సందర్భంగా స్వీట్లు కొనుక్కోవడానికి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు
రాహుల్ గాంధీకి సాదర స్వాగతం పలికిన స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్ మాట్లాడుతూ, రాహుల్ జీ మీ పెళ్లి కోసం మేమంతా వేచి ఉన్నామని, ఆ వేడుకలలో మిఠాయి ఆర్డర్‌ను పొందాలని ఎదురు చూస్తున్నట్టు ఆయనతో చెప్పారు.
తన తలితండ్రుల పెళ్ళికి స్వీట్లు ఆర్డర్ ఇచ్చిన ఇదే షాప్ కు రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకుని రావడం విశేషం . రాహుల్ షాపులో కలియతిరుగుతూ సరదాగా తనకిష్టమైన ఇమర్తి మరియు బేసన్ లడ్డులు తయారుచేయడానికి ప్రయత్నించారు
ఘంటేవాలా స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్ మాట్లాడుతూ , గాంధీ కుటుంబంలో ఏ శుభ కార్యాలు జరిగినా తమ షాపు నుంచే మిఠాయిలు వెళతాయని చెప్పారు
భారతదేశం మొత్తం ఆయన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పుకుంటున్నారు . అందుకే నేను ఆయనతో ” రాహుల్ జీ .. మీరు త్వరలో పెళ్లి చేసుకోండి .. కావాల్సిన స్వీట్లు అన్నీ మా షాపు నుంచే పంపిస్తాం.. అని చెప్పగా
దానికి ప్రతిగా ఆయన చిరునవ్వి ఊరుకున్నారు ” అని చెప్పారు
షాపులో గడిపిన రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ , ‘ రాజీవ్ గాంధీకి ఇమర్తి అన్నా బేసన్ లడ్డు అన్నా ఇష్టమని .. తనకు కూడా అవే ఇష్టమని’ చెప్తూ ఆ స్వీట్లు ఎలా తయారు చేయాలో షాపు కుర్రాళ్లను అడగటమే కాకుండా ఆయనే స్వయంగా లడ్డులు చేసారు
తన సందర్శన సమయంలో, కాంగ్రెస్ ఎంపీ దీపావళి సందర్భంగా షాప్ సిబ్బందిని అందరినీ పేరు పేరునా పలకరించి, వారు పండుగను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకున్నారు . తరువాత ఆయన ఒక వీడియోను Xలో పోస్ట్ చేసి, దీపావళి యొక్క నిజమైన తీపి ‘తాలి’లోనే కాదు, సంబంధాలు మరియు సమాజంలో కూడా ఉందని అన్నారు.
