విచిత్రంగా ఉంది కదా ?
కానీ నిజమే అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటున్నాడు
వివరాల్లోకి వెళ్తే ,
మధ్యప్రదేశ్ లోని పచ్ మర్తిలో సంగతన్ సరాజన్ అభియాన్ కోసం ఏఐసీసీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది
ఈ కార్యక్రమానికి అందరూ ఖచ్చితంగా టైముకి రావాలని , ఒకవేళ ఎవరన్నా లేట్ గా వస్తే వాళ్ళు క్రమశిక్షణా కమిటీ విధించే పనిష్మెంట్ కు సిద్ధంగా ఉండాలని ముందుగానే సభ్యులను హెచ్చరించారు
కానీ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు ఈ సమావేశానికి రెండు నిముషాలు ఆలస్యంగా వచ్చారు
దానితో ముందుగా నిర్ణయించిన నియమావళి ప్రకారం ఆలస్యంగా వచ్చినందుకు తనకు పనిష్మెంట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ను కోరడంతో ఆయనకు పది పుషప్ లు చెయ్యాలని పనిష్మెంట్ ఇచ్చారు
వెంటనే రాహుల్ గాంధీ ఎటువంటి భేషజాలకు పోకుండా సామాన్య కార్యకర్తలా పది పుషప్ లు చేసిన తర్వాతనే వేదిక మీదకు వెళ్లారు
ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఈ వార్త ట్రెండింగ్ అవుతుంది
సాక్షాత్తు అధినాయకుడు అయినప్పటికీ రాహుల్ గాంధీ ఎటువంటి ఈగోలకు పోకుండా పార్టీ నియమావళిని పాటించాడని ఎంపీ కాంగ్రెస్ నాయకులు కొనియాడుతున్నారు
నిజానికి సమావేశాల్లో సమయపాలన ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన పెట్టామని , ఇందువల్ల నాయకులు కానీ , కార్యకర్తలు కానీ సమయానికి వస్తే సభలు సజావుగా జరుగుతాయని భావించామని శిబిరం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుడు ఓ వార్తా సంస్థకు తెలిపాడు
కానీ ఈ నిబంధన గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆలస్యంగా వచ్చినందుకు తనకు కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరడంతో సమావేశ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఆయనకు పది పుషప్ ల పనిష్మెంట్ ఇచ్చారు
ఆ పనిష్మెంట్ పూర్తి చేసి సమావేశంలో ప్రసంగించిన తర్వాత రాహుల్ గాంధీ బీహార్ వెళ్లారని ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు !
