రామ్ గోపాల్ వర్మ చెప్పిన బెజవాడ ముచ్చట
రానా దగ్గుబాటి టాక్ షో లో రామ్ గోపాల్ వర్మ ని రానా ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్యలో మా బెజవాడ మాట రావడంతో ఆసక్తిగా చూసా
శివ సినిమా నేపథ్యం బెజవాడ గ్రూపుల నుంచే తీసుకున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు
రామ్ గోపాల్ వర్మ కూడా నాలాగే బెజవాడలో చదువుకున్నాడు
బెజవాడ వాసులకు స్థానిక రాజకీయాలు బాగా తెలుసు
మరీ ముఖ్యంగా విద్యార్థి రాజకీయాలు
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తనకు బెజవాడలో ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పారు
ఓసారి రామ్ గోపాల్ వర్మ తాలూకు విద్యార్థికి ప్రత్యర్థి గ్రూపు నుంచి ఏదో సమస్య వస్తే మాట్లాడుకోవడానికి వర్మతో తో పాటు ఓ పదిమంది స్టూడెంట్స్ బెంజ్ సర్కిల్ దగ్గర వెయిట్ చేస్తున్నారట
ఇంతలో సడెన్ గా ఓ అంబాసిడర్ కారు వేగంగా వచ్చి వీళ్ళముందు ఆగిందిట
అందులోనుంచి ఒక ధృఢకాయుడు దిగి లుంగీని సర్దుకుంటూ వీళ్ళదగ్గరికి వచ్చి చిన్నగా నవ్వుతూ “మీలో మెయిన్ ఎవరు? “అని అడిగాడట
ఆ తర్వాత అతడే మరింత దగ్గరగా వచ్చి ,
” చూడమ్మా.. మీ అమ్మానాన్నలు మీరు బాగా చదువుకుంటారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. గొడవల జోలికి పోవద్దు..” అని చిన్నగా నవ్వుతూ బుగ్గ గిల్లి వెళ్ళి కారు ఎక్కి కూర్చున్నాడట
కారు ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది
వీళ్లంతా షాక్ అయి ఆలా చూస్తుండిపోయారట
ఆ కారులో వచ్చినవాళ్ళు కర్రలు లాఠీలు తీసుకొచ్చుంటే ఎలా ఉండేదో తెలీదు కానీ వార్నింగ్ కూడా అంత స్మార్ట్ గా నవ్వుతూ ఇవ్వచ్చని నాకు అప్పుడే అర్ధమైంది
అది అలా మైండ్ లో ఉండిపోయింది
అదే సన్నివేశాన్ని ఓ హిందీ సినిమాలో వాడుకున్నా అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ
నిజమే విజయవాడలో వీధి తగాదాలు ఎక్కడా కనిపించవు
తొంభై శాతం మాటలతోనే సెటిల్ అయిపోయేవి !
రామ్ గోపాల్ వర్మ శివ మూవీకి విజయవాడ సన్నివేశాలే ప్రేరణ
అందుకే వర్మ మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యింది
అన్నట్టు అసలు విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కొన్ని సన్నివేశాలను వంగవీటి మూవీలో కూడా వాడుకున్నాడు కానీ విజయవాడలో 70-80 ల మధ్య జరిగిన అసలు కోణాలను పూర్తిగా చూపించలేకపోయాడు
అసలు వంగవీటి కథ వేరే ఉంది!
అది ఇంకో కథనంలో చెప్పుకుందాం!!
పరేష్ తుర్లపాటి ✍️