ఎన్ని కష్టాలు , నష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలో ఎలా నడుచుకోవాలో రామాయణం మానవాళికి బోధిస్తుంది
భారత దేశమే కాదు అనేక ప్రపంచ దేశాలు రామాయణ గ్రంథంలోని ధర్మ సుక్ష్మ్యాన్ని గుర్తించి అనుసరిస్తున్నాయి
తాజాగా పాకిస్తాన్ గడ్డ మీద కూడా రామాయణం దృశ్య నాటిక ఆదరణ పొందుతుంది
ఇటీవల కరాచీ నగరంలో ఓ నాటక బృందం రామాయణ దృశ్య నాటికను ప్రదర్శిస్తే పాకిస్తానీయుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది
అన్నిటికన్నా ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే ఈ నాటకంలో పాత్రలు పోషించిన కళాకారులు కూడా పాకిస్థానీయులే
దీనికి మూలకారకులు యోగేశ్వర్ కరెరా , మరియు రాణా కాజ్మ లు
వీరికి నాటక రంగంపై మక్కువ ఎక్కువ
ఆ మక్కువతోనే థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది మరికొందరు మిత్రులతో కలిసి మౌజ్ అనే ఓ నాటక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు
ఆ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోని వివిధ నగరాల్లో నాటిక ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు
అయితే ఈ నాటికలో భాగంగా రామాయణ ఇతివృత్తాన్ని నాటికగా ప్రదర్శిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది యోగేశ్వర్ కి
పాకిస్తాన్ గడ్డ మీద హిందూ నాటికను ప్రదర్శిస్తే ఆదరణ సంగతి అలా ఉంచితే ప్రాణాలకు ప్రమాదం కూడా రావొచ్చని మిత్రులు అతడ్ని హెచ్చరించారు
అయినా యోగేశ్వర్ తన ప్రయత్నాన్ని మానలేదు
గత నవంబర్ లో తొలిసారి రామాయణ నాటికను ప్రదర్శించారు
అయితే ఆశర్యకరంగా పాకిస్తానీయులు నుంచి ఈ నాటికకు అనూహ్య ఆదరణ వచ్చింది
దీనితో నిర్వాహకులకు మరింత ఉత్సాహం వచ్చి కృత్రిమ మేధ సాయంతో వేదికను రంగుల మాయం చేసి కరాచీలో మూడు రోజులపాటు ఈ నాటికను ప్రదర్శించారు !