సినీ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ సాయంతో చదువుకుని పూరి గుడిసె నుంచి రెండిళ్ళు సొంతం చేసుకున్న స్థాయికి ఎదిగిన ఓ అమ్మాయి స్ఫూర్తివంతమైన యదార్ధ గాధ !

Spread the love

సినీ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ సాయంతో చదువుకుని పూరి గుడిసె నుంచి రెండిళ్ళు సొంతం చేసుకున్న స్థాయికి ఎదిగిన ఓ అమ్మాయి స్ఫూర్తివంతమైన యదార్ధ గాధ !

మనకున్న నటులలో చాలామంది వెండి తెరమీద మాత్రమే హీరోలు
మేకప్ తీసేస్తే వాళ్ళూ మాములు మనుషులే

కానీ కొందరే నిజ జీవితంలో కూడా హీరోలుగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు

అటువంటి రియల్ హీరోలలో సూర్య ఒకడు

15 సంవత్సరాల క్రితం పేద విద్యార్థులకు చదువులు చెప్పించేందుకు సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించాడు

ఆ సంస్థ ఇచ్చిన ఆలంబనతో నేటికి 1500 మంది పేద విద్యార్థులు ఇంజినీర్లు కాగా 51 మంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు

రెండ్రోజుల క్రితం చెన్నైలో అగరం ఫౌండేషన్ 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఓ అమ్మాయి ఇచ్చిన స్పీచ్ సూర్య కంట తడి పెట్టించింది

ఆ అమ్మాయి పేరు జనప్రియ

అగరం ఫౌండేషన్ గురించి జనప్రియ మాటల్లో ,

“నా పేరు జనప్రియ .. నేను ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను .. చక్కటి జీవితం .. సంతోషంగా గడిచిపోతుంది .. నేను ఈ స్థాయికి రావడం వెనుక రియల్ హీరో సూర్య గారి సాయం ఉంది.. నా గతం ఓ పీడకల .. మా ఊరి పేరు అగరం .. చిన్న గ్రామం .. నాన్న తాగుబోతు .. మేముండే నివాసం చిన్న పూరి గుడిసె .. వర్షం వస్తే నీటితో గుడిసె నిండిపోయేది .. వర్షం నీటికి పాములు కొట్టుకొచ్చి గుడిసెలో దూరేవి .. కరెంట్ ఉండేది కాదు .. భవిష్యత్తు అంధకారంగా కనిపించేది .. నాకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది .. కానీ మా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించేది కాదు .. ఎలాగోలా 12 వరకు చదువు పూర్తీ చేశా .. అప్పట్లో కాలేజీ టాపర్ని నేనే .. ఇంకా పై చదువులు చదవాలని ఉంది .. కానీ నిస్సహాయ స్థితి నాది .. అదే సమయంలో మా మేడం అగరం ఫౌండేషన్ నెంబర్ నాకు ఇచ్చింది .. ఆ నెంబర్ తీసుకుని ఫౌండేషన్ కు కాల్ చేయడంతో నా జీవితమే మారిపోయింది .. వెంటనే అగరం ఫౌండేషన్ నాకు ఆపన్న హస్తం అందించింది .. కాలేజ్ చదువుల్లో గోల్డ్ మెడల్ వచ్చింది .. చదువు పూర్తి కాగానే టిసిఎస్ లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది .. కొంతకాలానికి ఇన్ఫోసిస్ లో మరింత మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది .. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా .. పూరి గుడిసెలో పాములతో ఇబ్బందులు పడిన నేను రెండు ఇళ్లను సొంతం చేసుకున్నా .. నా ఈ విజయానికి సూర్య గారి అగరం ఫౌండేషనే కారణం .. చదువుకుని ఆడపిల్లలు ఏం చేస్తారు? అని చాలామంది నిరుత్సాహపరుస్తారు. కానీ అమ్మాయిలు కూడా బాగా చదువుకుని లక్ష్యాలు సాధిస్తారనటానికి నా జీవితమే ఓ ఉదాహరణ .. నా జీవితం ఇంత సంతోషంగా మారటానికి కారకుడు అయిన సూర్య సార్ నాకు దేవుడి లెక్కే ” అని కన్నీటి పర్యంతం అవడంతో సూర్య కూడా కన్నీటిని ఆపుకోలేక నిలబడి చప్పట్లు కొట్టాడు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!