దావూద్ ఇబ్రహీం నుంచి మీరేం నేర్చుకున్నారు రామ్ గోపాల్ వర్మా ?
నూరు విజయాల తర్వాత వచ్చే ఒక్క పరాజయం కొంతమందిని ఐడెంటిటీ క్రైసిస్ లో పడేస్తుంది
అటువంటి వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు
మీరు గమనించండి
ఇదే మనిషి సినీ ఇండస్ట్రీలో వరుస విజయాల్లో ఉన్నప్పుడు కాంట్రావర్సీ స్టేట్మెంట్ ఒక్కటి కూడా ఉండేది కాదు
సినిమా గురించి , సినిమా విజయానికి తాను పడ్డ కష్టం మాత్రమే చెప్పుకునేవాడు
అప్పట్లో అంతకుమించి అతనికి తన గురించి చెప్పుకునే అవసరమే రాలేదు
ఎందుకంటె అతని విజయాలే ప్రపంచానికి అతడ్ని పరిచయం చేసాయి
సక్సెస్ శిఖరాలకు చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా ఎక్కడో కాలుజారి ఫెయిల్యూర్ అగాధంలోకి పడిపోయాడు
మంచి సినిమాలు తీసినప్పుడు పొగిడిన నోళ్లే కథతో సంబంధం లేకుండా కేవలం ఆడదాని అవయవాలను మాత్రమే చూపించే సినిమాలను తీసే స్థాయికి పడిపోవడంతో ఆర్జీవీ ని ప్రేక్షకులు పక్కనబెట్టారు
అప్పట్నుంచి ఆయనలో ఐడెంటిటీ క్రైసిస్ స్టార్ట్ అయ్యింది
దాని పర్యవసానమే వివాదాస్పద ట్వీట్లు
ఈ ట్వీట్ల వల్ల పోలీస్ కేసులు కూడా ఎదుర్కుంటున్నారు
అయినా ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్లు పెట్టడం ఆపటం లేదు
ఆ ట్వీట్ల వల్లనే తాను నలుగురి దృష్టిలో అప్పుడప్పుడైనా పడుతున్నాను అన్న విషయం తెలుసుకుని అదే కంటిన్యూ చేస్తున్నారు
తాజాగా రెండ్రోజుల క్రితం గురు పూజ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ వివాదాస్పదం అయ్యింది
గురు పూజ దినోత్సవం సందర్భంగా తన గురువులకు నమస్కరిస్తూ ‘ తాను సినిమాల్లో ఈ స్థాయికి ఎదగటానికి కారకులైన అమితాబ్ బచ్చన్ , స్టీవెన్ స్పిల్బర్గ్ , అయాన్ ర్యాండ్ , బ్రూస్ లీ , శ్రీదేవి మరియు దావూద్ ఇబ్రహీం లకు నమస్కారాలు , హ్యాపీ టీచర్లు డే ‘ అని x లో పోస్ట్ చేసారు
ఆర్జీవీ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు
అమితాబ్ నుంచి శ్రీదేవి వరకు ఓకే కానీ దావూద్ ఆర్జీవీ కి ఏ విధంగా గురువు అవుతాడో చెప్పాలని ప్రశ్నించారు
భారత్ కు వ్యతిరేకంగా విధ్వంసాలకు పాల్పడిన దావూద్ నుంచి ఆర్జీవీ ఏం నేర్చుకున్నాడు ?
నోటేరియస్ క్రిమినల్ దావూద్ గ్యాంగులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడా ?
గురువుగా దావూద్ ఆదేశాలను వర్మ ఇండియాలో అమలు చేశాడా ? అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు
ఒక పేరుమోసిన నేరగాడ్ని తన గురువుగా చెప్పుకుంటున్న రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టి అరెస్ట్ చెయ్యాలని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు !