Home » కాంతారా రిషబ్ శెట్టి అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ గిఫ్ట్ అందుకున్న అమితాబ్ ఏమన్నాడో తెలుసా ?

కాంతారా రిషబ్ శెట్టి అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.. ఆ గిఫ్ట్ అందుకున్న అమితాబ్ ఏమన్నాడో తెలుసా ?

Spread the love

నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమా కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ అయి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వర్ధమాన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో పోటీదారుగా కనిపించాడు.

ఇందుకు సంబంధించి KBC నిర్వాహకులు ప్రోమోని రిలీజ్ చేసారు .

ఈ షోకి రిషబ్ శెట్టి సాంప్రదాయక ధోతిలో వచ్చాడు .

షోకి రావడంతోనే రిషబ్ అమితాబ్ దగ్గరికెళ్లి పళ్లెంలో ధోతీని ఆయనకు బహుకరిస్తూ ఇది తన తరపున ఇస్తున్న గిఫ్ట్ అని స్వీకరించమని అభ్యర్దించాడు

రిషబ్ శెట్టి ఇచ్చిన బహుమతిని స్వీకరిస్తూ అమితాబ్ బచ్చన్, “సర్, నేను ఈ ధోతీని ఖచ్చితంగా ధరిస్తాను. అయితే నేను దీన్ని ధరించే కళను మీనుంచి నేర్చుకోవాలి.. ఎందుకంటే సరిగా కట్టుకోవడం రాక ధోతీ జారిపోతే చూడలేక ఇబ్బంది పడేది మీరే ” అని నవ్వుతూ అనడం తో రిషబ్ తో సహా అక్కడున్నవాళ్ళందరూ హాయిగా నవ్వారు

రిషబ్ శెట్టి ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 9 గంటలకు సోనీ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *