తల్లి ప్రేరణతో ఐఏఎస్ , ఐపీఎస్ సాధించి సక్సెస్ అయిన అక్కచెల్లెళ్ళు
తమిళనాడులోని కడలూరు జిల్లా మరంగురుకు చెందిన సుష్మిత , ఐశ్వర్యలు అక్కాచెల్లెళ్లు
అయితే ఈ ఇద్దరూ అఖిల భారత సర్వీసులకు సెలెక్ట్ అయి ఒకరు ఐఏఎస్ కాగా మరొకరు ఐపీఎస్ అయ్యారు
వీరి విజయం వెనుక ఆమె తల్లి స్ఫూర్తి ఉంది
తల్లి ఇళవరసి సాధారణ గృహిణి
తండ్రి రామనాధం రైతు
ఇళవరసి కి ఎలాగైనా అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనే లక్ష్యం ఉంది
ఆవిడకు పాలిటెక్నిక్ పూర్తవగానే పెళ్లి కావడంతో దూర విద్య ద్వారా బీఎస్సీ పూర్తిచేసి ప్రభుత్వ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం మొదలుపెట్టారు
అలా ఆరుసార్లు పరీక్షలకు అటెమ్ట్ చేసినా ఆమె పాస్ కాలేకపోయింది
అయినా నిరుత్సాహ పడకుండా ఆఖరి ప్రయత్నంగా ఏడోసారి పరీక్ష రాసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు
కానీ అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనేది ఆమె అసలు కల
ఇళవరసి కలను యూనియన్ సర్వీసులకు సెలెక్ట్ కావడం ద్వారా ఆమె కూతుళ్లు నెరవేర్చారు
తల్లి ప్రేరణతో కూతుళ్లు ఇద్దరూ సివిల్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకుని సిద్ధం అయ్యారు
ఒకపక్క వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
తీరప్రాంత గ్రామం కావడంతో ఎప్పుడూ వరదలు , ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం ఏర్పడేది
దానికి తోడు 2004 లో వచ్చిన సునామీకి వీరి ఇల్లు దెబ్బ తింది
ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో అక్క సుష్మిత సివిల్స్ రాసారు
కోచింగ్ ఫీజులు కట్టే స్తొమత లేకపోవడంతో చెల్లికి సివిల్స్ లో మెళుకువలు ఆమే బోధించేవారు
చెల్లి ఐశ్వర్య 2018 లో మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ రైల్వే సర్వీసుకు సెలెక్ట్ అయ్యారు
దాంతో సంతృప్తి చెందకుండా 2019 లో తిరిగి ప్రయత్నించి ఐఏఎస్ సాధించారు
చెల్లి స్పూర్తితో అక్క కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయి ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యింది
ఒకే కుటుంబంలో అక్కాచెల్లెళ్లు ఒకరు ఐఏఎస్ , మరొకరు ఐపీఎస్ కు సెలెక్ట్ కావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
ఈ విజయానికి స్ఫూర్తి తమ తల్లి అని చెబుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు !