స్పెల్లింగ్ మిస్టేకులతో కూడిన చెక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఒక టీచర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. రాష్ట్ర విద్యా శాఖ వెంటనే స్పందించి ఈ తప్పులను “తీవ్రమైనది మరియు ఆమోదయోగ్యం కానిది” అని పేర్కొంటూ ఆయన్ని వివరణ కోరింది.
అట్టర్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తాను పనిచేసిన రోన్‌హాట్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జారీ చేసిన రూ.7,616 చెక్కుపై సంతకం చేసినట్లు తెలుస్తుంది
సంఖ్యా విలువ Rs 7616 /- రూపాయలు అని సరిగ్గా వ్రాయబడినప్పటికీ, వర్డ్స్ లో ఆయన రాసిన “Saven Thursday six Harendra sixty rupees,” పదాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయని బ్యాంకు గుర్తించింది, ఫలితంగా చెక్కు తిరస్కరించబడింది.
ప్రతిస్పందనగా, హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత వేగంగా చర్య తీసుకుంది.
జిల్లా విద్యా అధికారి రాజీవ్ డోగ్రా ఆయన సస్పెన్షన్‌ను ధృవీకరించారు “ఈ విషయంలో శాఖ పూర్తి చర్యలు తీసుకుంటోంది మరియు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేశారు” అని పేర్కొన్నారు.
ఈ కేసుపై శాఖ దర్యాప్తు ప్రారంభించడంతో సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే ఉపాధ్యాయుడికి పంపబడింది.
ఇదిలా ఉండగా ఉపాధ్యాయుడికి విద్యాశాఖ పంపిన సస్పెన్షన్ లెటర్లో కూడా స్పెల్లింగ్ తప్పులున్నాయని గుర్తించారు. ముఖ్యంగా, ఉపాధ్యాయుడికి జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌లో “సిర్మౌర్,” “ఎడ్యుకేషనేషన్,” మరియు “ప్రిన్స్‌పాల్” వంటి చాలా స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని తేలడంతో విద్యా శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు
విద్యాశాఖాధికారి రాజీవ్ ఠాకూర్ కూడా సస్పెన్షన్ డాక్యుమెంటేషన్‌లో ఈ తప్పులను అంగీకరించారు, “ఉపాధ్యాయుడికి జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌లలో క్లరికల్ తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దవచ్చు, కానీ అతను చెక్కుపై చేసిన తప్పును సరిదిద్దలేము. అతను పదాల నిర్మాణాన్నే మార్చాడు.”అని కవర్ చేసుకున్నారు
దర్యాప్తు కొనసాగుతున్నందున, విద్యాశాఖ అధికారులు డాక్యుమెంటేషన్‌పై కఠినమైన నియంత్రణలను అమలు చేయాలని మరియు అన్ని స్థాయిలలో జవాబుదారీతనాన్ని పెంచాలని భావిస్తున్నారు.
