అంతరిక్షం లోకి అడుగుపెట్టిన భారతీయుడు శుభాంశు శుక్లా .. ‘క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రా ‘ ఎమోషనల్ అయిన శుక్లా తల్లితండ్రులు .. !

Spread the love

‘క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరా ‘

అంతరిక్ష యానం అనేది చాలామందికి కల .. కానీ కొందరికి మాత్రం అది లక్ష్యం

41 సంవత్సరాల క్రితం 23 ఏళ్ళ వయసులోనే కెప్టెన్ రాకేష్ శర్మ ఆ లక్ష్యాన్ని సాధించగా ఇప్పుడు 39 ఏళ్ళ శుభాన్షు శుక్ల ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారు

యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్ల ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ లో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12. నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లారు

ఫాల్కన్ రాకెట్ లాంచింగ్ కు ముందు ‘ వేచి చుడండి .. నేను తిరిగి వస్తా ‘ అని తన తల్లితండ్రులకు సందేశం పంపాడు

అంతకుముందు శుక్లా తల్లితండ్రులతో వీడియో కాల్ మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు

శుక్లా తల్లి అప్పటికప్పుడు పెరుగులో పంచదార వేసి కొడుక్కి వర్చువల్ గా తినిపించడం చూపరులకు ఎమోషన్ తెప్పించింది

కొడుకుని దీవిస్తూ ఆ తల్లితండ్రులు ‘ క్షేమంగా వెళ్లి లాభం గా తిరిగి రా ‘ అని ఆశీర్వదించారు

ఇదిలా ఉండగా ఫాల్కన్ రాకెట్ భూ కక్ష్యలోకి ప్రవేశించి వ్యోమ నౌక నుంచి విడిపోయినప్పుడు శుభాంశు తన సంతోషాన్ని భారతీయులతో పంచుకుంటూ ,

‘ ప్రియమైన నా తోటి భారతీయులారా .. ఇప్పుడు నేను కొన్ని సంతోష క్షణాలను మీతో పంచుకుందాం అనుకుంటున్నా.. ప్రస్తుతం మేము ప్రయాణిస్తున్న వ్యోమ నౌక భూ కక్ష్యలోకి ప్రవేశించి సెకనుకు 7. 5 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంది .. ఇప్పుడు నా భుజాన వేసుకున్న మన మువ్వ్వన్నెల జాతీయ పతాకం గర్వంతో ధగ ధగా మెరిసిపోతుంది .. 41 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడిగా రోదసీలోకి అడుగుపెట్టడం నాకు గర్వ కారణంగా ఉంది .. జైహింద్ అని సందేశం పంపారు

వీరు ప్రయాణిస్తున్న వ్యోమ నౌక గురువారం సాయంత్రం షుమారు 4. 30 నిముషాల ప్రాంతంలో ఐ ఎస్ ఎస్ తో అనుసంధానం అవుతుంది
రోదసీ ప్రయాణంలో ఐ ఎస్ ఎస్ తో అనుసంధానం అవడం ముఖ్యమైన ఘట్టం

తర్వాత 14 రోజుల పాటు భారరహిత స్థితిలో ప్రయోగాలు కొనసాగుతాయి

ప్రయోగాలు కొనసాగుతున్న దశలోనే ప్రధాని మోడీతోనూ , విద్యార్థులతోనూ .. ఆ నలుగురు వ్యోమగాములు ముచ్చటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!