ఇంటర్ ఫెయిల్ .. అయితేనేమి వ్యాపారంలో పాస్ అయి 2,300 కోట్ల ఆస్తులకు అధిపతి అయిన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ !
ఓటమి గెలుపుకు నాంది అంటారు కదా
అలాగే తమిళనాడుకు చెందిన గిరీష్ జీవితంలో కూడా ఎన్నో వైఫల్యాలు, ఓటమిలు ఎదురయ్యాయి
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మిడిల్ క్లాస్
దానికి తోడు అతడికి ఏడేళ్ల వయసులోనే తల్లితండ్రులు విడిపోయారు
కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అతడి చదువు అటకెక్కింది
ఇంటర్ ఫెయిల్ అయ్యాడు
సొంతంగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు
కానీ చేతిలో డబ్బులు లేవు .. డిగ్రీలు లేవు
ఏ వ్యాపారం చెయ్యాలన్నా అంతోకొంతో పెట్టుబడి కావాలి
అందుకే కసితో కష్టపడి చదివి ఎంబీఏ పూర్తీ చేసాడు
ఎంబీఏ పూర్తికాగానే గిరీష్ కి హెచ్ సి ఎల్ లో జాబ్ వచ్చింది
కానీ అతడి గోల్ జాబ్ కాదు
సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తనలాంటి ఇంకో పదిమందికి ఉపాధి కల్పించాలి
అతడి ఆలోచనను స్నేహితులు , బంధువులు హేళన చేసారు
‘నీ తెలివితేటలకు ఉద్యోగం రావడమే గొప్ప .. అలాంటిది చక్కటి జాబ్ వదులుకుని సొంతంగా వ్యాపారం పెట్టుకుని నెట్టుకురావడం నీ వల్ల అయ్యే పనేనా ? ‘ అని ఎగతాళి చేసారు
కానీ గిరీష్ వాళ్ళ మాటలను పట్టించుకోలేదు
తన లక్ష్యం వైపు గురిపెట్టాడు
గిరీష్ ఆలోచనలకు అతడి స్నేహితుడు కృష్ణన్ మద్దతు ఇచ్చాడు
ఇద్దరూ ఉద్యోగంలో దాచుకున్న కొద్దిపాటి మొత్తం కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు
అంతే , 2010 లో చెన్నైలో 700 sft గదిలో ఫ్రెష్ వర్క్స్ పేరిట కంపెనీ ప్రారంభం అయ్యింది
ఫ్రెష్ వర్క్స్ అనేది ఐటి సొల్యూషన్స్ అందించే సంస్థ
కంపెనీ ప్రస్తుత విలువ 50 వేల కోట్లు దాటింది
అతడి కంపెనీ 125 దేశాలకు విస్తరించి పదివేలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకుంది
ఫ్రెష్ వర్క్స్ కంపెనీలో అతడికి 5. 5 శాతం షేర్లు ఉన్నాయి
ప్రస్తుతం గిరీష్ మొత్తం ఆస్తులు 2,350 కోట్లకు పైనే ఉంది
‘ఏ పనైనా మొదట హేళనలతో మొదలై ఓటమితో ఎదురుదెబ్బలు తగిలి లక్ష్యం వైపు రాటుదేలేలా పరుగులు పెట్టించి గమ్యాన్ని చేరుస్తాయి.. అలాగే లక్ష్యం చేరుకోవడం వెనుక నేను కూడా ఎన్నో హేళనలను ఎదుర్కొన్నాను .. ఓటమిని చవిచూశాను .. అయినా నిరుత్సాహపడకుండా నా లక్ష్యం కోసం పట్టుదలగా కఠోర శ్రమ చేశాను .. అంతిమంగా విజయం నన్ను వరించింది ‘ అంటాడు గిరీష్
గిరీష్ సక్సెస్ స్టోరీ చాలామంది విద్యార్థులకు , ఔత్సాహిక వ్యాపారస్తులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుంది !