బిఎ చదివి మొదటి ప్రయత్నంలోనే IRS , నాలుగో ప్రయత్నంలో IPS కు సెలెక్ట్ అయిన తెనాలి కుర్రోడి సక్సెస్ స్టోరీ !
చాలామంది సివిల్స్ కు సెలెక్ట్ అవ్వాలంటే సైన్స్ చదవాలనో , ఇంజనీరింగ్ చదవాలనో భావిస్తారు
కానీ లక్ష్యం గట్టిగా ఉంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా సివిల్స్ కు సెలెక్ట్ కావడం పెద్ద కష్టమైన పనేమీ కాదంటున్నారు ఏపీలోని తెనాలికి చెందిన విజయ్ బాబు
చెప్పడమే కాదు లక్ష్యాన్ని సాధించి చూపించాడు
తెనాలికి చెందిన దోనేపూడి విజయ్ బాబు 2021 లో మొదటి ప్రయత్నంలోనే IRS కు సెలెక్ట్ అయి ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
అయితే కుమారుడు ఐఏఎస్ కావాలనేది తండ్రి కల
కొడుకును కలెక్టర్ గా చూసుకోవాలని చిన్నప్పటి నుంచే అతడి చదువులపై శ్రద్ద పెట్టాడు
ఐఏఎస్ కు సెలెక్ట్ కావాలంటే సైన్సు మాత్రమే చదవక్కర్లేదు ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ప్రయత్నిస్తే పెద్ద కష్టమైన పనేమీ కాదని ఆయనే కొడుకుని ప్రోత్సహించి ఇంటర్లో MEC లో జాయిన్ చేసారు
ఇంటర్లో 975 మార్కులతో రాష్ట్ర స్థాయి రాంక్ సాధించాడు విజయ్ బాబు
ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బిఎ హానర్స్ లో సీట్ కోసం అప్లై చేసాడు
400 సీట్ల కోసం షుమారు 30 వేల మంది అప్లై చేస్తే అందులో విజయ్ బాబుకు కూడా సీటొచ్చింది
2019 లో బిఎ ఆనర్స్ లో కూడా ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యాడు
చదువు పూర్తి కాగానే తండ్రి కోరిక మేరకు సివిల్స్ మీద దృష్టి పెట్టాడు
2021 లో మొదటి ప్రయత్నంలోనే విజయ్ బాబు IRS కు సెలెక్ట్ అయ్యాడు
కానీ తనను ఐఏఎస్ గా చూడాలనేది తండ్రి కోరిక కాబట్టి మరోసారి సివిల్స్ రాసాడు
తిరిగి IRS కు మాత్రమే సెలెక్ట్ అయ్యాడు
అయినా నిరుత్సాహపడకుండా సివిల్స్ రాయడంతో నాలుగో ప్రయత్నంలో 2024 లో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాడు
ఇంకోసారి సివిల్స్ రాసి ఈసారి ఖచ్చితంగా ఐఏఎస్ సాధించి తండ్రి కలను నెరవేరుస్తానని విజయ్ బాబు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు
విజయ్ బాబు తండ్రి మధుబాబు కూడా తను కలెక్టర్ కావాలని కలలు కన్నాడు
ఇందుకోసం అయన ఎనిమిది పీజీలు కూడా చేసాడు
అయితే ఆయన సివిల్స్ కు సెలెక్ట్ కాకపోవడంతో GST విభాగంలో సూపెరింటెండ్ గా చేసి సర్వీస్ రికార్డుల ప్రకారం IRS హోదాలో రిటైర్ అయ్యారు
తాను కలెక్టర్ కాలేకపోయినా తన కలను కొడుకు నిజం చేస్తున్నాడని ఆ తండ్రి సంతోషంగా చెప్పుకుంటున్నారు !