ఆహా ఆంధ్రమాత గోంగూర !
. గోంగూర!పొడి గోంగూర!పచ్చళ్ళ గోంగూర!గట్టిగా అరుచుకుంటూ వెళుతున్నాడు పెద్దయ్య! “ఒరేయ్ బాలయ్యా! వాణ్ణి పిలు.. ఆ గోంగూర అమ్మే వాణ్ని….” అంటూ బామ్మ వంటింట్లోంచి వరండాలోకి రయ్యి రయ్యి మని వచ్చేసింది కాసె పోసి కట్టుకున్న చీరకొంగు భుజం మీదకు లాక్కుంటూ! గోంగూర గంప రావటం, ‘అయ్యగారూ! ఓ చెయ్యేసి సాయం చేయండి’ అనటం, పేపరు చదువు కుంటున్న నాన్నగారు, జారిపోతున్న లుంగీ పంచను పైకి లాక్కుంటూ గంప దించు కోవటానికి సాయం చేయటం, అన్ని టకటకా…
