ఎవరీ హర్ష్ సంఘవి ? పిన్న వయసులోనే మోడీ నమ్మకస్తుడిగా ఎలా ఎదిగాడు ? గుజరాత్ అమిత్ షా అనే పేరు ఎలా వచ్చింది ?
గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన కెరీర్‌కు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాడు హర్ష సంఘవి . ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవడంతో కేవలం 40 సంవత్సరాల వయస్సులో, సంఘవి గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు . గతంలో అమిత్ షా మరియు ప్రదీప్‌సిన్హ్ జడేజా వంటి పార్టీ పెద్దలు ఈ పదవిని చేపట్టారు. సంఘవి రాజకీయ జీవితం చాలా వేగంగా ఎదిగింది…
