నేటితో పుల్వామా దాడికి ఏడేళ్లు-అమర జవానులకు నివాళులు – అసలు ఆ రోజేం జరిగింది?
ఈ మధ్య వచ్చిన అమరన్ సినిమా చూసారా ? అందులో మేజర్ ముకుందన్ ఆధ్వర్యంలో కొంతమంది సైనికులు ఓ మిలిటరీ ఆపరేషన్ కోసం వ్యానులో బయలుదేరుతారు వ్యానులో వెళ్తుండగా సైనికులకు తమ కుటుంబాలు గుర్తుకొస్తాయిఈ ఆపరేషన్ పూర్తి చేసుకుని సజీవంగా వెనక్కి వస్తామో లేదో తెలీదు దారిలోనే ఉగ్రవాదులు ఏ క్షణాన ఎటువైపునుంచి అటాక్ చేస్తారో తెలీదుఅందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని తెలుసు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే సొంతూళ్లలో తమకోసం…
