Home » kavisamrat_viswanatha_satyanarayana

విశ్వనాథ వారు – ఆసనాలు !

-పేరాల బాలకృష్ణ విశ్వనాథ వారు భోజన ప్రియులే కానీ ఎప్పుడూ తమ ఆరోగ్యం విషయంలో ఎక్కడా అశ్రద్ధ లేదు. ఆనాడు పొద్దున నేను అమ్మమ్మగారికి మాఇంట్లో కాసిన దొండకాయలిద్దామని వెళ్ళా… వరెండా దాటి మధ్య గదిలోకి వచ్చేసరికి, ఆ పక్క గదిలోంచి … అది తాతగారి పడగ్గది …. గట్టిగా బుస కొడుతున్న శబ్దం వినిపించి భయ భయంగా దగ్గరకేసున్న ఆ తలుపు నెమ్మదిగా తోసా…. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తా ” అమ్మమ్మా!…

Read More

విజయవాడ అలంకార్ థియేటర్కెళ్లిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ !

– పేరాల బాలకృష్ణ . విజయవాడ అలంకార్ థియేటర్కెళ్లిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ! సాయంత్రం ఐదయింది. నేను రోడ్డునపడి కాగితం రాకెట్లు ఎగరేస్తూ, పరుగులు పెడుతూ ఆడుకుంటున్నా……! కొంచం దూరంగా గురువుగారు రిక్షాలో మాయింటి కొస్తూ కనిపించారు. ఆయన్ని చూడగానే ఆ రిక్షాకి ఎదురెళ్లి వెనకాల వేలాడుతూ నేనూ పరిగెడుతూ వచ్చా. రిక్షా దిగిన తాతగారి చెయ్యి పట్టుకుని ఆయనతో పాటు లోపలికొచ్చాను. నాన్నగారు హడావిడి హడావిడిగా తయారవుతున్నారు.గేటు తీస్తున్న చప్పుడుకి బయట మాష్టార్ని చూసి…

Read More