విజయవాడలో వంగవీటి ప్రభ (లు )
80 వ దశకంలో విజయవాడలో దివంగత వంగవీటి మోహన రంగా ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున ప్రభలు నిర్వహించేవారు ఈ ప్రభలు చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా రాష్ట్రము నలుమూలల నుంచి ఉదయానికే జనం పోటెత్తేవారు సాయంత్రం 6 గంటల నుంచి విజయవాడ గాంధీ నగర్లోని జింఖానా మైదానం నుంచి ప్రభలు బయలుదేరతాయని తెలిసినా కూడా ఊళ్ళ నుంచి ఉదయాన్నే వచ్చిన జనం మైదానంలోనే వంటావార్పు చేసుకునేవాళ్ళు అది కాస్తా సాయంత్రానికి ఇసకేస్తే…
