రన్ దీప్తి రన్ – యండమూరి వీరేంద్రనాథ్
అంకితం … పుత్రికోత్సాహము తల్లికి తండ్రికి, వారసులు జన్మించిన బుట్టదు, జనులా పుత్ర పౌత్ర పుత్రికల పొగడగ నాడెల్లరు పొందుర ఉత్సాహము ఇలలో సుమతీ! బద్దెన కవి పద్దెము, మద్దెన విడగొట్టినందుకు క్షమించాలి. పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొని ఉన్న కాల౦లోనే, “సిరికిని, ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ… (ప్రతి భర్తకూ భార్యనే గొప్ప సంపద)” అంటూ స్త్రీకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన బద్దెన కవి కూడా ‘కొడుకు పుడితే తండ్రికి సంతోషం’ అన్నాడు. సరే. అది అప్పటి…
