అయ్యారే ! ఈ వంట మాస్టర్ల నెల ఆదాయం కోటి పైనే !

Spread the love

అయ్యారే ! ఈ వంట మాస్టర్ల నెల ఆదాయం కోటి పైనే !

విలేజ్ కుకింగ్ ఛానెల్ అని ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రేండింగ్ అవుతుంది. ఇన్ స్టాలో కూడా వీళ్ళ వీడియోలు కనిపిస్తాయి.

సరే ఇటువంటి యూ ట్యూబ్ ఛానెల్స్ బోలెడు ఉన్నాయి .. ఇందులో విశేషం ఏంటంటారా ?

తమిళనాడుకు చెందిన ఒక సామాన్య వంటవాళ్లు ఓ వినూత్న ఐడియాతో సోషల్ మీడియా సాయంతో తమ వంటలకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు

తమిళంలో మాట్లాడుతూ వంటలు చేసే ఈ ఐదుగురు పాకశాస్త్ర నిపుణుల ఆదాయమెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ఒక్కో దినుసు పేరును పెద్దగా పలుకుతూ అరటితోటల మధ్యలో వంటలు చేయడం వీరి ప్రత్యేకత
ఈ కాన్సెప్ట్ తక్కువ సమయంలో చక్కటి ఫలితాలు ఇచ్చింది

అసలు ఈ ఛానెల్ ఎలా మొదలైంది? వారి ప్రస్తుత ఆదాయమెంత? లాంటి వివరాలు చూద్దాం

ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో తో పాటు కూర్చున్న వారే వంట మాస్టర్లు.

రాహుల్ కుడి పక్కన కూర్చున్నాయన పేరు పెరియతంబి (75). మిగిలిన వారిలో నలుగురు పెరియతంబి మనవళ్లు

మరొక యువకుడు దగ్గరి బంధువు.

చెన్నై నుంచి రోడ్డు మార్గాన ప్రయాణిస్తే 430 కిమీ దూరంలో ఉండే పుదుక్కొట్టై జిల్లాలోని చిన్న వీరమంగళం గ్రామం వీరిది.

పెరియతంబి గత 50 ఏళ్లుగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమలకు వంటలు చేసే వాడు

తర్వాత ఆయన మనవలు కూడా ఆ బృందంలో చేరారు.

పాక శాస్త్రంలో యెంత అనుభవం ఉన్నా ,పేరున్న వంటమాస్టర్లు అయినా వారి ఆదాయం అంతంత మాత్రమే.

ఇది గమనించిన ఆ పెద్దాయన మరో మనవడు వి. సుబ్రమణ్యం యూట్యూబ్ ఆలోచన చేసాడు.

ఆ యువకుడు కామర్స్ లో ఎం. ఫిల్ చేసి ఒక వెబ్ సైట్ నడుపుతున్నాడు.

ఆలా ఏప్రిల్ 2018 లో విలేజ్ కుకింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది.

సహజత్వం ఉట్టిపడేలా తమిళంలో దినుసుల పేర్లు పెద్దగా పలుకుతూ చేసే ఈ వంటల కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్టించి క్రమంగా ఆదాయం తెచ్చిపెట్టే మార్గంగా మారింది.

ఇవన్నీ ఒకెత్తు .. రాహుల్ రాక మరొక ఎత్తు
రాహుల్ గాంధీ రాక వారి ఆలోచనను మరో స్థాయికి చేర్చింది

తమిళనాడులో 2018 లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీకి స్థానిక కార్యకర్యలు విలేజ్ కుకుంగ్ వంట మాస్టర్ల ప్రతిభ గురించి చెప్పారు.

స్వయంగా వారి దగ్గరకి వెళ్లిన ఆయన వారికి వంటలో సాయపడుతూ ఉత్సాహ పరిచారు.

అక్కడి నుంచే అమెరికాలోని తన స్నేహితుడికి ఫోన్ చేసి ఈ పాక నిపుణులను అక్కడికి రప్పించుకుని వారి నైపుణ్యం ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరాడు .

రాహుల్ అక్కడికి వెళ్లడాన్ని తమిళ మీడియాతో పాటు జాతీయ వార్తా సంస్థలు ప్రముఖంగా ప్రస్తావించాయి.

క్షణంలో ప్రపంచం దృష్టి ఈ తమిళ పాకశాస్త్ర వంట వాళ్ళ మీద పడింది

దానితో పెరియతంబి టీం సెలెబ్రిటీలై పోయారు.

ఆ తర్వాత వీరి ఛానెల్ కు వారానికి 30,000 నుంచి 40 వేల మంది సబ్ స్క్రయిబర్లు యాడ్ అవడం మొదలైంది.

కొద్దిరోజుల్లోనే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం 2 కోట్ల 82 లక్షల మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారు. దానితో వారి నెలసరి ఆదాయం వ్యూస్ ను బట్టి కోటి నుంచి రూ. కోటిన్నర వరకు చేరింది.

ఈ రాబడిని ఐదుగురు చెఫ్ లు, వీడియా తీయించి, ఎడిటింగ్ తర్వాత యూట్యూబ్ లో పోస్ట్ చేసే బాధ్యతలు చూసే సుబ్రమణ్యంతో కలిసి మొత్తం ఆరుగురు సమానంగా పంచుకుంటారు

ఇది కాక స్థానిక మసాలా, కారం పొడి లాంటి ఉత్పత్తులుకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు వీరు ఎక్కడైనా ఫంక్షన్లో వంట చేయాలంటే రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు వరకు చార్జి చేస్తారు.

అదీ సంగతి !

బి టి గోవిందా రెడ్డి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!