“రేయ్ ! యెవర్రా మీరంతా ? కారులో ప్రకాశం పంతులు గారు ఉన్నారు వెళ్లిపోండి” అని అరిచారు బులుసు సాంబమూర్తి గారు

Spread the love

ఒకసారి ప్రకాశం పంతులు గారు బులుసు సాంబమూర్తి గారితో కలిసి పనిమీద కారులో మద్రాస్ బయలుదేరారు

ముందు సీట్లో డ్రైవర్ పక్కన గుమస్తా కూర్చోగా వెనుక ప్రకాశం గారు..సాంబమూర్తి గారు కూర్చున్నారు

ప్రయాణం రాత్రి పూట కావటంతో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరూ నిద్రలో కునికిపాట్లు పడుతున్నారు

ఇంతలో దారిలో సడెన్ గా దోపిడీ  దొంగలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి కారును ఆపారు

డ్రైవర్ సడెన్ గా కారును ఆపటంతో మెలుకువ వచ్చిన సాంబమూర్తి గారు కారు దిగి చూసాడు

ఆయనకు అర్థమైంది వాళ్ళు దొంగలని ..

అయినా భయపడకుండా ,

రేయ్..కారులో ఎవరున్నారో తెలుసా..? పంతులు గారు ఉన్నారు.. వెళ్లిపోండి ” అని అరిచారు

దొంగలు నమ్మలేదు

పంతులు గారి పేరు చెపితే వెనక్కి వెళ్లిపోతామని ఈయన బురిడీ కొడుతున్నాడని అనుకున్నారు

అదే విషయం సాంబమూర్తి గారితో అన్నారు

ఇక చేసేదేమి లేక సాంబమూర్తి గారు పంతులు గారిని నిద్ర లేపారు

కారు ఆగిపోవటం గమనించిన పంతులు గారు ఆవులిస్తూ కారులోనుంచి కిందికి దిగారు

లైటు వెలుగులో ప్రకాశం గారిని చూసిన దొంగలు షాక్ అయ్యారు

ఎవర్రా మీరంతా ? పార్టీ ఫండ్ ఇవ్వటానికొచ్చారా ?”

 అని ప్రకాశం గారు ఛలోక్తి విసిరారు

అప్పుడు పక్కనే ఉన్న సాంబమూర్తి గారు ,

పంతులు గారూ.. వీళ్ళు దొంగలు..కారులో మీరున్నారని చెప్పినా వినకుండా మిమ్మల్ని చూస్తే గానీ నమ్మం అంటే తమరిని దింపాల్సివచ్చింది ” అని అసలు విషయం చెప్పారు

పంతులు గారిని చూడగానే దొంగలు చేతులు జోడించి ,

పంతులు గారూ దండాలయ్యా.. ఎంతో మంది కూటికి లేనోళ్ళకి అన్నం పెట్టిన చేతులు అయ్యా మీవి..తెలియక మీ కారు ఆపాము..మమ్మల్ని క్షమించండయ్యా “అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పంతులు గారి కాళ్ళమీద పడ్డారు

అదీ ప్రకాశం పంతులు గారికి ఉన్న విలువ

కరడుగట్టిన దొంగలు సైతం పేదలకు పట్టెడన్నం పెట్టె పంతులు గారి పేరు చెప్పగానే చేతులు జోడించి దణ్ణం పెట్టి కాళ్ళమీద పడ్డారు

  ఒక  వీడియోలో  ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ  సంగతి చెప్పారు  !!

పరేష్ తుర్లపాటి


Spread the love

One thought on ““రేయ్ ! యెవర్రా మీరంతా ? కారులో ప్రకాశం పంతులు గారు ఉన్నారు వెళ్లిపోండి” అని అరిచారు బులుసు సాంబమూర్తి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!