తెలుగు టీవీ న్యూస్ యాంకరమ్మ చెప్పిన కథ !

Spread the love

తెలుగు టీవీ న్యూస్ యాంకరమ్మ చెప్పిన కథ

తెలుగు టీవీ న్యూస్ యాంకర్ సౌజన్య ఒక వీడియోలో మానవ అనుబంధాల గొప్పతనాన్ని తెలియచేసే ఒక కథ చెప్పారు

ఆ కథ ఏమిటంటే,

అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది భార్య ..భర్త.. పిల్లవాడు

ఒకసారి వీళ్ళ స్నేహితుడు పిల్చిన పుట్టిన రోజు పార్టీకి కారులో బయలుదేరుతారు

దారిలో రోడ్డుపక్కన పుచ్చకాయల బండి కనబడటంతో ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మతో ‘ నాకు ఆ పుచ్చకాయ కావాలి..కొనిపెట్టమని’ అడుగుతాడు

అప్పుడు వాళ్ళ అమ్మ ‘ ఇప్పుడు మనం బర్త్ డే పార్టీకి వెళ్తున్నాం కదా..ఇప్పుడొద్దు..ఇంకో రోజు కొనుక్కుందాంలే ‘ అంటుంది

దానికి ఆ పిల్లవాడు ఒప్పుకోడు

ఇప్పుడే కొనల్సిందే అని మారాం చేస్తాడు

దాంతో చేసేది ఏమీ లేక బండి దగ్గర కారు ఆపుతారు

పుచ్చకాయలు అమ్మే పిల్లతో’ రేట్ ఎంత ?’అని అడుగుతుంది పిల్లవాడి తల్లి

ఒక కాయ 50 రూపాయలు అని చెప్తుంది ఆ పిల్ల

“అదేంటి అంత రేట్ చెప్పావ్? ముప్పై రూపాయలు చేసుకో “అని బేరమాడుతుంది పిల్లవాడి తల్లి

“లేదమ్మా నాకు గిట్టుబాటు కాదమ్మా.. కావాలంటే ఓ ఐదు రూపాయలు తగ్గించి 45 రూపాయలు ఇవ్వండమ్మా “అంటుంది ఆ పిల్ల

తల్లికి విసుగొచ్చి’ బేరం కుదరట్లేదు..ఇంకోసారి కొనుక్కుందాం లే ‘అని పిల్లవాడికి చెప్తుంది

అయినా పిల్లవాడు వినకపోవడంతో ‘ చూడు.. వీడూ నీ తమ్ముడి లాంటి వాడు అనుకో..ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి 40 రూపాయలు చేసుకుని ఒక కాయ ఇవ్వు ” అంటుంది

అప్పుడు ఆ పిల్ల ఒక కాయ తీసుకుని ఆ పిల్లవాడి చేతిలో పెట్టబోతుంది

పొరపాట్న చేయిజారి ఆ కాయ కింద పడిపోయి పగిలిపోతుంది

వెంటనే ఆ పిల్ల ఇంకో కాయ తీసి పిల్లవాడికి ఇస్తుంది

ఇదంతా చూసిన పిల్లవాడి తల్లికి కోపం వస్తుంది

“ఇదిగో పిల్లా కాయ పొరపాటున కింద పడేసింది నువ్వు..కాబట్టి రెండు కాయలకు డబ్బులు అడుగుతావేమో ? నేను ఒక కాయకే డబ్బులు ఇస్తాను “అంటుంది

దానికి ఆ పిల్ల “అయ్యో ఒక్క కాయకు కూడా డబ్బులు వద్దమ్మా.. వాడు నా తమ్ముడు అన్నారుగా అందుకే ఇచ్చానమ్మ..వీడ్ని చూస్తే చిన్నప్పుడు చనిపోయిన నా తమ్ముడు గుర్తొచ్చాడమ్మా.. అనుబంధాల విషయంలో లాభ నస్టాలు చూసుకోకూడదమ్మా ” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది

ఈ మాటలు విన్న పిల్లవాడి తల్లికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి

వెంటనే పర్స్ లోనుంచి వంద రూపాయలు తీసి ఆ పిల్లచేతిలో పెట్టబోతుంది

కానీ ఆ పిల్ల “వద్ధమ్మా..వాడు నా తమ్ముడు అన్నారుగా..తమ్ముడి దగ్గర అక్క డబ్బులు తీసుకుంటుందా ? “అని డబ్బులు తీసుకోదు

దాంతో పిల్లవాడి తల్లి పుట్టినరోజు పార్టీలో పిల్లకు గిఫ్టుగా ఇద్దామనుకున్న రింగ్ తీసి ఆ పిల్ల చేతిలో పెడుతూ ” వాడు నీ తమ్ముడు అన్నావ్ కదా..అప్పుడు నేను నీకు అమ్మను అవుతాను కదా.. అందుకే అమ్మ ఇచ్చే ఈ రింగును ప్రేమగా తీసుకో” అంటూ రింగు పిల్ల చేతిలో పెడుతుంది

కారులో వెళ్తుండగా భర్త అడుగుతాడు

“నువ్ మాములుగా బేరం లేకుండా ఏమీ కొనవు కదా..అలాంటిది ఈ పిల్లకు ఏకంగా రింగ్ ఇచ్చేసావు ఏంటి ? “అని అడుగుతాడు

అప్పుడు భార్య ,

“ఆ పిల్ల చెప్పిన ఒక మాట కరెక్ట్ అండి..అనుబంధాల విషయంలో లాభ నష్టాలు చూసుకోకూడదు.. తమ్ముడిని కోల్పోయిన ఆ పిల్లకు అనుబంధాల విలువ పూర్తిగా తెలుసు..అందుకే ఆ పిల్లకు రింగ్ ఇచ్చాను” అంటుంది

వెంటనే భర్త కళ్లంబడి నీళ్లతో వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి ,

“అన్నయ్యా..ఆస్తి విషయంలో నువ్వెలాంటి డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే..అనుబంధాల విలువ తెలియక నీ మీద ఆస్తి కోసం కోర్టులో కేసు వేశా.. నన్ను క్షమించు అన్నయ్యా..”అని విలపిస్తాడు

దాంతో వాళ్ళ అన్నయ్య కూడా” అదేంట్రా నువ్వు నా తమ్ముడివిరా..నీకు ఎలా అన్యాయం చేస్తాను..ఇంటికి రారా అన్నీ మాట్లాడుకుందాం” అంటాడు కన్నీటితో

ఇదండీ యాంకర్ సౌజన్య గారు చెప్పిన కథ

లాభ నస్టాలు కోసం చక్కటి అనుబంధాలను , ఆత్మీయతలను తెంచుకోవద్దు అనే సందేశంతో కథ ను ముగించారు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!