“చెప్పాపెట్టకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే అంతేగా అంతేగా అంటాననుకున్నారా ?” – F 2 ఫేమ్ విన్నకోట ప్రదీప్

Spread the love

“చెప్పాపెట్టకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే అంతేగా అంతేగా అంటాననుకున్నారా ?” – F 2 ఫేమ్ విన్నకోట ప్రదీప్

గురువారం రాత్రి తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం క్యాన్సిల్ అవడంతో షుమారు 60 మంది ప్రయాణీకులు ఎయిర్పోర్టులోని వారి ఆఫిసు ఎదుట నిరసన వ్యక్తం చేసారు

వారిలో సినీ నటుడు F 2 ఫేమ్ విన్నకోట ప్రదీప్ కూడా ఉన్నారు

ఈ నిరసనలపై స్పైస్ జెట్ వారి కధనం ఒకలా ఉండగా , ప్రదీప్ కధనం ఇంకోలా ఉంది

సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని కొందరు స్పైస్ జెట్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయగా , మరికొందరు స్పైస్ జెట్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వివాదం వైరల్ అవడంతో ఈ రోజు ప్రదీప్ ఒక వీడియో ద్వారా అసలా రోజు ఏం జరిగిందో వివరించారు

ప్రదీప్ మాటల్లో ,

నేను ఫ్యామిలీతో బిజినెస్ పనిమీద తిరుపతి వచ్చాను

గురువారం రాత్రి 8. 45 నిమిషాల ఫ్లైట్ కు తిరిగి హైద్రాబాదుకు స్పైస్ జెట్ లో టికెట్ బుక్ చేసుకున్నాను

సాయంత్రం 6. 30 నిమిషాలకు ఎయిర్పోర్టుకు బయలుదేరదాం అనుకుంటుండగా సాంకేతిక కారణాలతో ఫ్లైట్ రాత్రి 11 గంటలకు ఆలస్యంగా బయలుదేరుతుంది అని మెసేజ్ వచ్చింది

దానితో టైం ఉంది కదా అని శ్రీనివాస మంగాపురం వెళ్లి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి రాత్రి 7. 30 నిమిషాలకు ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు ఇంకో మెసేజ్ వచ్చింది

దానితో నేను ఎయిర్పోర్టుకు వెళ్లేసరికి అప్పటికే అక్కడ మిగతా ప్రయాణీకులు చేరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు

నేను స్పైస్ జెట్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ దగ్గరకెళ్ళి ఫ్లైట్ క్యాన్సిల్ చేసారు కదా ? మరి మాకు అల్టెర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేసారా ? అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు

ఎంతమంది ఏమడిగినా వారినుంచి తెలీదు అన్న సమాధానమే వచ్చింది

అన్నిటికన్నా ఒక చంటి పాప తల్లి తన బిడ్డకు ఫీడింగ్ ఇవ్వాలని లోపలి పంపించమని బతిమిలాడినా ఆమెను లోనికి పంపలేదు

ఆమె తన స్పైస్ జెట్ టికెట్ , ఆధార్ కార్డు చూపించినా కనీస కనికరం లేకుండా పోలీసులు , స్పైస్ జెట్ సిబ్బంది ఆమెను లోనికి పంపలేదు

దాంతో నాకు కోపం వచ్చి ఇంతమంది అడుగుతున్నా కనీసం రెస్పాండ్ అవడంలేదేంటని స్పైస్ జెట్ అమ్మాయిని ప్రశ్నించా

మీకు చేతకాకపోతే కనీసం మీ మేనేజర్ ను అయినా పిలవమని అడిగాను

ఇంత గొడవ జరుగుతున్నా స్పైస్ జెట్ మేనేజర్ కనీసం రూములోనుంచి బయటికి రాలేదు

కస్టమర్ తో మీటింగులో ఉన్నట్టు సిబ్బందితో చెప్పించాడు

ఆఖరికి 45 నిమిషాల తర్వాత మేనేజర్ బయటికి వచ్చాడు

చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని , వారిలో చంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారని చెప్పినా ఆయన సరిగా స్పందించలేదు

నిజానికి ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల వ్యక్తిగతంగా నాకొచ్చిన ఇబ్బందేమీ పెద్దగా లేదు . తిరిగి నా ఫ్రెండ్ అరేంజ్ చేసిన హోటల్ రూమ్ కి వెళ్ళగలను . కానీ పిల్లలు , వృద్దులు ఇబ్బంది పడతారని ఆ రోజు స్పైస్ జెట్ సిబ్బందిని నేను కోప్పడటం జరిగింది

ఇదీ అసలు ఆ రోజు జరిగిన సంఘటన

వాస్తవం ఇలా ఉండగా కొందరు వీడియోల్లో నేను ఆవేశపడిన కొన్ని బిట్లను మాత్రమే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రదీప్ నోటి దురుసుతనం అని ఏవేవో థంబ్ నెయిల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు

అందుకే ఈ వివరణ ఇస్తున్నాను

అయినా కూడా ఆ సందర్భంగా ఎవరినైనా నొప్పించి ఉంటె క్షమించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను
అని ముగించారు ప్రదీప్


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!