అ అంటే అమ్మ..ఆ ఆదివాసీ మహిళ ఆశయం గొప్పది !

Spread the love

ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు వ్యక్తులు చేస్తారు
ఆశయం గట్టిదైతే ఆచరణ అసాధ్యం కాదు

నూటికి నూరు శాతం అక్షరాస్యత సాదించాలనేది ప్రభుత్వాల ఆశయం

కానీ ఆశయం గట్టిగా లేకపోవడంతో నేటికీ నూరు శాతం అక్షరాస్యత రేటింగ్ సాదించలేకపోయాం

అలా అని ప్రభుత్వాలను తిడుతూ కూర్చోకుండా ఓ సామాన్య ఆదివాసీ మహిళ తన వంతు ప్రయత్నం తాను చేసింది

నలుగురితో మొదలైన ఆమె విద్యా బోధన నేడు 45 మందికి చేరుకుంది
ఆమె పేరు మాల్తీ ముర్ము

మాల్తీ ముర్ము సాధించిన విజయ గాథ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి

వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లా అయోధ్యకు చెందిన జిలింగ్ సెరెన్ విలేజ్ కు 2019 లో మాల్తీ ముర్ము అనే ఓ ఆదివాసీ మహిళ హౌస్ వైఫ్ గా అడుగుపెట్టింది

రావడంతోనే ఆమె ఊరిలో బడి లేకపోవటం గమనించింది

ఊరి పిల్లలు బడికి పోవాలంటే 40 మైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్ళాలి

దానితో ఆ విలేజ్ లో పిల్లలు ఎవరూ బడికి వెళ్లడం లేదు

పోనీ ఊరిలో ప్రభుత్వ బడులు కానీ ప్రైవేట్ బడు లు కానీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అంటే అవీ లేవు

ఊళ్ళో సొంతంగా బడి కట్టించుకోవాలని గతంలో గ్రామస్తులు ప్లాన్ చేసినప్పటికీ నిధుల లేమితో ఆగిపోయారు

ఇటువంటి పరిస్థితుల్లో మాల్తీ ముర్ము ఆ గ్రామంలోకి అడుగుపెట్టింది

ఆలా అని ఆమె ఏమీ ధనవంతురాలు కాదు
సామాన్య ఆదివాసీ మహిళ

కానీ ఎలాగైనా పిల్లలకు చదువు నేర్పాలని ఆమె మనసులో బలమైన ఆశయం ఉంది

తన ఇల్లు చూస్తే మట్టితో అలికిన నాలుగు గోడలు మినహా మరేమీ లేదు

అయినా ఆమె నిరుత్సాహ పడలేదు

ఊరిలో పిల్లలకు తన ఇంటిలోనే ఉచితంగా చదువు చెప్తానని చాటింపు చేసింది

మొదట్లో గ్రామస్తులు ఎవరూ ఆమె మాటను సీరియస్ గా తీసుకోలేదు

నలుగురు పిల్లలు మాత్రమే చదువుకోవడానికి వచ్చారు

ఆ మట్టిగోడకే ఓ బోర్డు బిగించి అక్షరాలు దిద్దుతూ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది ముర్ము

అనతికాలంలోనే చదువు నేర్చుకుంటున్న పిల్లల్లో సృష్టమైన మార్పును చూసారు గ్రామస్తులు

దానితో ఒకరంబడి ఒకరు ఆమె బడిలో తమ పిల్లలను చేర్పించారు

ఇప్పుడు ఆ మట్టిగోడల మధ్య చదువు నేర్చుకునే పిల్లలు 45 మంది అయ్యారు

అలా అని ఆమె ఫీజుల రూపంలో పిల్లల దగ్గరనుంచి నయాపైసా తీసుకోవడం లేదు

ఎవరైనా దాతలు కానీ , ప్రభుత్వాలు కానీ ముందుకు వస్తే మరింత మంది పిల్లలకు పాఠాలు చెప్పాలనేది తన ఆశయమని ఆమె చెప్తుంది

అంతేకాదు ప్రభుత్వం ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తే పిల్లలకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా నేర్పేందుకు సిద్ధంగా ఉన్నానని ముర్ము ఆత్మా విశ్వాసంతో చెప్తుంది

అక్షరాశ్యత సాధనలో ఇటువంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది

కనీస సౌకర్యాలు లేకపోయినా నాలుగు మట్టి గోడలని పాఠశాల చేసుకుని పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న మాల్తీ ముర్ము ఎందరో మహిళలకు స్ఫూర్తి

ఇటువంటి వారికి ప్రభుత్వాలు సహాయం చేస్తే మరింత మందిని అక్షరాశ్యులను చేస్తారనడంలో సందేహం లేదు

దయచేసి మాల్తీ ముర్ముకు మద్దతుగా ఈ సమాచారం ప్రభుత్వాలకు చేరే వరకు షేర్ చెయ్యండి

పైన ఇచ్చిన షేర్ ఆప్షన్స్ ద్వారా వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ (X ) లలో షేర్ చేయగలరు

ఆ ఆదివాసీ మహిళ చేస్తున్న మంచి ప్రయత్నాన్ని మనః స్ఫూర్తిగా అభినందిద్దాం !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!