2022 లో విరాట్ కోహ్లీ లెజెండరీ గాయకుడు కిషోర్ కుమార్ ఇంటిని కొనుగోలు చేసి దాన్నే వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ గా ఆధునీకరించాడు
ముంబైలో విరాట్ కోహ్లీ సొంతంగా స్థాపించిన ఔట్లెట్లలో ఇది మొదటిది
తన అభిమాన గాయకుడి జ్ఞాపకార్థం ఈ రెస్టారెంటుని తీర్చి దిద్ది తక్కువ ధరలలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాడు
ఈ రెస్టారెంట్లో భోజనం కేవలం 318 రూపాయలకే అందిస్తున్నాడు
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన గౌరీ కుంజ్ లో ఉంది
అయినా తన అభిమాన గాయకుడి గౌరవార్థం మాములు రేట్లతోనే తన వన్ 8 రెస్టారెంట్లో చక్కటి మెనూ అందిస్తున్నాడు
తాజాగా విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ లు తమ రెస్టారెంట్లో దొరికే పదార్దాలు , వాటి రేట్లు మెన్షన్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది
తమ రెస్టారెంట్లో ఆర్గానిక్ వంటకాల నుంచి , మాంసం , సీ ఫుడ్ వరకు అన్నిరకాల పదార్దాలు దొరుకుతాయని ఆ వీడియోలో చెప్పారు
కోహ్లీ తన జీవన శైలి అంతా శాఖాహారంతోనే ముడిపడి ఉందని చెప్తూ , రెస్టారెంట్లో ప్రత్యేకంగా ‘ విరాట్ ఫేవరెట్స్ ‘ అనే విభాగాన్ని ప్రారంభించినట్టు చెప్పారు
ఈ విభాగంలో పూర్తిగా సాంప్రదాయ వంటకాలతో పాటు మిల్లెట్స్ వంటి ఆహార ధాన్యాలతో చేసే పదార్దాలు ఉంటాయని చెప్పారు
రెస్టారెంటుకు వన్ 8 కమ్యూన్ అనే పేరు పెట్టడం వెనుక చిన్న కారణం ఉంది
క్రికెట్లో విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నెంబర్ 18 . అందుకే ఆ నెంబర్ కలిసొచ్చేలా కోహ్లీ తన రెస్టారెంటుకి వన్ 8 అనే పేరు పెట్టాడు
తాను అభిమానించే గాయకుడి ఇంటినే రెస్టారెంటుగా మర్చి తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం తనకు సంతృప్తిని ఇస్తుందని కోహ్లీ అంటున్నాడు
అలాగని తమ రెస్టారెంట్లో ఆహార నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదని , తమ రెస్టారెంటుకి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ సంతృప్తికరంగా భోజనం చేసి తిరిగి మళ్ళీ వచ్చే విధంగా పదార్థాలు క్వాలిటీ ఉండటంతో పాటు చక్కటి ఇంటీరియర్ కూడా చేయించినట్టు ఆయన చెప్పారు
కోహ్లీకి ముంబైలో రెస్టారెంట్ తో పాటు ఢిల్లీ , కోల్ కతా , పూణే లలో కూడా వన్ 8 రెస్టారెంట్ ఔట్లెట్లు ఉన్నాయి
త్వరలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తమ రెస్టారెంట్ ఔట్లెట్లను విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు కోహ్లీ చెప్తున్నాడు
2017 లో విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లిచేసుకున్నాడు
వీరికి ఒక బాబు , ఒక పాప
అనుష్క కూడా 2018 లో జీరో చిత్రంలో కనిపించింది
వీడియోలో వీరి మాటలను బట్టి విరాట్ కోహ్లీ క్రికెట్లో రిటైర్ అయిన తర్వాత వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ల విస్తరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది !
