Home » రష్యా అధ్యక్షుడు పుతిన్ చాణక్యలో దిగెన్ .. ఇంతకీ చంద్రగుప్తని మించిన ఈ చాణక్య స్పెషాలిటీ ఏంటి ?

రష్యా అధ్యక్షుడు పుతిన్ చాణక్యలో దిగెన్ .. ఇంతకీ చంద్రగుప్తని మించిన ఈ చాణక్య స్పెషాలిటీ ఏంటి ?

Spread the love

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం కొద్దిసేపటి క్రితం ఇండియా వచ్చారు

మారుతున్న అమెరికా , ఇండియా సంబంధాల నేపథ్యంలో పుతిన్ భారత్ రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది

భారత్ తో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికే రష్యా అధ్యక్షుడు వచ్చారని పైకి చెప్తున్నా అసలు విషయం వేరే ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా

ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఎడాపెడా టారిఫ్ లు విధిస్తున్న సంగతి తెలిసిందే

ట్రంప్ టారిఫ్ ల గోల పడలేక ఇటీవల చైనాలో ఇండియా , రష్యా , చైనా దేశాధినేతలు చర్చలు కూడా జరిపారు

మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ తిరిగి రష్యాకి దగ్గరైంది

గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దౌత్య సంబంధాల్లో భారత్ అమెరికా కన్నా రష్యా వైపే ఎక్కువగా మొగ్గు చూపేది

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవిలోకి వచ్చాక , రాకముందు కూడా భారత ప్రధాని మోడీని తన ఆప్త మిత్రుడిగా చెప్పుకుంటూ వచ్చారు

యునైటెడ్ స్టేట్స్ లో గణనీయంగా ఉన్న భారతీయుల్లో ఈ ప్రభావం పనిచేసింది

అమెరికా ఐటి ఆధారిత రంగంలో భారతీయులే ఎక్కువగా ఉండటంతో ట్రంప్ గెలిస్తే ఆయనతో సత్సంబంధాల దృష్ట్యా మరింత లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోవచ్చని ఇండియా భావించింది

కానీ ట్రంప్ గెలిచిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి

ఆయన విధించే టారిఫ్ ల బెడద తట్టుకోలేక కొన్ని బాధిత దేశాలు ఏకమౌతున్నాయి

ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చారు

ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా పుతిన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు

ఆయనకి ఢిల్లీలో ప్రత్యేకంగా ‘ చాణక్య ‘ లో బస ఏర్పాటు చేసారు

అసలీ చాణక్య అంటే ఏంటి ? దీని ప్రత్యేకతలు ఏంటి ?

ఢిల్లీలో ఐటిసి వారిచే నడపబడుతున్న హోటల్ మౌర్య లో ప్రత్యేకమైన సూట్ పేరే చాణక్య

షుమారు 4,600 చదరపు అడుగుల విస్టీర్ణంలో అత్యాధునిక వసతులతో ఉండే ఈ సూట్ అద్దె ఒక్క రాత్రికి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే

అంతేనా ఇందులో లేని సౌకర్యాలు అంటూ ఉండవు
ఒక రకంగా చెప్పాలంటే రాజ భవనం తీసుకొచ్చి చాణక్యలో పెట్టారు

సూట్ లోపలి ఇంటీరియర్ చూస్తే ఎవరికైనా నిజంగానే రాజ మహల్ గుర్తుకొస్తుంది
పురాతన భారతీయ రాజరిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చేతి వృత్తుల వారి ద్వారా అందంగా నగిషీలు చెక్కించారు

సూట్ మొత్తం పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే విధంగా మేలు రకం కలపను ఉపయోగించి తయారు చేసారు
ఫ్లోరింగ్ మొత్తం కూడా చెక్కతోనే చేసారు

ప్రఖ్యాత చిత్రకారులు వేసిన తైలవర్ణ పెయింటుగులు గోడలకు అందాలను తీసుకొస్తాయి

ఇదంతా ఒకెత్తు పురాతన అర్థశాస్త్రం ఆధారంగా రూపొందించిన కొన్ని ప్రత్యేక వస్తువులను సూట్ లో భాగం చేయడం మరొకెత్తు

అతిధులు లంచ్ , డిన్నర్ చేసేందుకు వీలుగా అత్యాధునిక డైనింగ్ రూమ్ ఏర్పాటు చేసారు
దీనికోసం చక్కటి విల్లెరాయ్ మెటీరియల్ వాడారు
పదార్దాల కోసం క్రిస్టల్ డి పారిస్ గాజు సామాన్లు వాడతారు

చాణక్య సూట్ ప్రత్యేకంగా దేశాధినేతలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు

అతిధిలు వాకింగ్ చేసుకోవడానికి ఇన్సైడ్ గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది
రకరకాల పచ్చని చెట్లతో నిండి ఉంటుంది కాబట్టి గార్డెన్లో విహరిస్తున్న అనుభూతి కలిగిస్తుంది

ఇది కాకుండా ప్రైవేట్ స్టీమ్ రూమ్ , జిమ్ , విశాలమైన మాస్టర్ బెడ్ రూమ్ , గెస్ట్ రూములు , ఆఫీస్ రూమ్ , పర్సనల్ గా మాట్లాడుకోవడానికి ప్రైవేట్ రూమ్ , లోపలే స్విమ్మింగ్ పూల్ , ఇలా ఒక్కమాటలో చెప్పుకోవాలంటే చాణక్య అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఒక రాజమహల్

ఇదే సూట్ కి అనుకుని చంద్రగుప్త సూట్ కూడా ఉంది కానీ చాణక్య సూట్ ప్యాలస్ కి కిరీటం లాంటిది

చంద్రగుప్తతో పోలిస్తే చాణక్య ఖరీదైనది , అత్యంత ఆధునికమైనది

అయితే గతంలో కొంతమంది చిన్న దేశాల అధినేతలు చంద్రగుప్తలో కూడా ఆతిధ్యాన్ని స్వీకరించారు

భద్రతా ఏర్పాట్లు

ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల దృష్ట్యా పుతిన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు

ఆయన రాకముందే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ మౌర్య హోటల్ ని తమ ఆధీనంలోకి తీసుకుంది

బయటి వారికి ప్రవేశం లేకుండా మొత్తం అన్ని గదులను బుక్ చేసుకున్నారు . లోపల కారిడార్లను బారీకేడ్లతో మూసేసారు

బయటినుంచి చీమ కూడా లోపలికి దూరకుండా పటిష్టమైన నిఘా పెట్టారు

ఈరోజు రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇవ్వబోతున్నారు

ఈ విందులో వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారనే విషయంపైన ఫెడరల్ టీమ్ వెయ్యి చెవుల నిఘా పెట్టిందని సమాచారం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!